Vikarabad Crime: లోన్ కోసం వెళితే.. తన పేరుపై 38 అకౌంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Crime: ఇంటి నిర్మాణం కోసం లోన్ కోసం బ్యాంక్ కు వెళ్లిన వ్యక్తి కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంక్ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. అతని పేరుపై ఇప్పటికే 38 ఖాతాలు ఉన్నట్లు చెప్పడంతో.. లోన్ కోసం వెళ్లిన వ్యక్తం ఆశ్చర్యానికిగి గురయ్యాడు. తను లోన్ తీసుకోలేదని అయినా 38 ఖాతాలు బ్యాంక్ వారు ఎలా చేశారని ప్రశ్నించడంతో బ్యాంక్ సిబ్బంది కూడా సమాధానం చెప్పలేక షాక్ తిన్నారు. ఒక వ్యక్తిపై 38 ఖాతాలు ఎలా ఓపెన్ చేశారనేది అందరికి ప్రశ్నార్థంగా మారింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: MLC Kavitha: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఆ.. విషయంపై ప్రశ్నల వర్షం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. కొంతమేర పనులు పూర్తి చేసిన అనంతయ్య మిగిలిన పనులు పూర్తి చేసేందుకు లోన్ తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈనేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంక్ లో అనంతయ్య నుంచి వివరాలు సేకరించిన బ్యాంకు సిబ్బంది షాకింగ్ న్యూస్ చెప్పారు. అనంతయ్య పేరుతో 38 అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. అందులోనూ.. 12 అకౌంట్లు యాక్టివ్‌లో, మిగతా 26 క్లోజ్ అయ్యాయని, తన పేరు మీద ఓ లోన్ కూడా ఉందని చెప్పడంతో అనంతయ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఇప్పటి వరకు ఏలోన్ తీసుకోలేదని బ్యాంక్ సిబ్బంది తను లేకుండా ఎలా లోన్ ఇచ్చారని, ఖాతాలు ఎలా చేశారని ప్రశ్నించాడు. అయితే బ్యాంక్ సిబ్బంది ఎవరూ స్పందిచకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించాడు. తనకే తెలియకుండా ఎవరో తన పేరు మీద బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారనే అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈసంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని అనంతయ్య తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం వెళితేగానీ ఈ విషయం తెలియలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి దీనిపై పోలీసులు, బ్యాంక్ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. అసలు అనంతయ్యకు తెలియకుండా బ్యాంక్ సిబ్బంది లోన్‌లు ఎలా ఇచ్చారు. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు.
Love Marriage : 92 ఏళ్ల వయస్సులో ప్రేమ.. త్వరలోనే ఆమెతో పెళ్లి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!