A Woman Robbed By A Couple In Sangareddy: సంగారెడ్డిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా దారిలో వెళ్తుండగా.. ఒక జంట ఆమెను ఆపి, కల్లులో మత్తు మందు కలిపి, నిలువునా దేచేసుకున్నారు. మత్తు దిగిన తర్వాత విషయం గ్రహించి.. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరు మండలంలో రామేశ్వరం బండకు ఒక మహిళ ఒంటరిగా వెళ్తోంది. అక్కడే ఉన్న ఒక జంట ఆమెని ఆపి.. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడిగారు. ఆ తర్వాత ఆ మహిళతో మాట మాట కలిపారు.
Social Look: పొట్టి నిక్కర్ లో రష్మిక.. అలా వెనక్కి తిరిగి చూసిన వరుణ్ తేజ్
అనంతరం తమ స్కూటీపై రామేశ్వరం బండ వద్ద డ్రాప్ చేస్తామని చెప్పి ఆ మహిళను ఎక్కించుకున్నారు. తనకూ కాస్త నడిచే భారం తగ్గుతుంది కదా.. ఆమె స్కూటీపై ఎక్కింది . రామేశ్వరం బండ వద్ద దిగాక.. ఆ జంట కల్లు ఆఫర్ చేశారు. ఉచితంగా వస్తోంది కదా అని, ఆ మహిళ సరేనంది. ఇదే అవకాశమని భావించి.. ఆ జంట కల్లులో మత్తుపదార్థం కలిపి, ఆ మహిళకు ఇచ్చారు. అది తాగాక ఆ మహిళ మత్తులోకి జారుకుంది. ప్లాన్ సక్సెస్ కావడంతో.. ఆ జంట ఆమెపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 25 వేలు తీసుకుని పరారయ్యారు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
Vijay Antony: బ్రేకింగ్.. విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమం..?
మత్తు దిగిన తర్వాత ఆ మహిళ విషయం గ్రహించింది. ఆ జంట తనని మోసం చేసి, నిండా దోచేసిందని అర్థం చేసుకుంది. విషయం కుటుంబసభ్యులకు తెలియజేసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గ్రామంలో సీసీటీవీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించగా.. అందులో మొత్తం తతంగం రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా పోలీసులు ఆ జంటని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు