Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ.. నిన్న బోట్ ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా విజయ్ ఎగిరి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మలేషియా బయల్దేరి వెళ్లి విజయ్ పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడి నుంచి విజయ్ ను చెన్నైకు తరలించినట్లు విజయ్ భార్య ఫాతిమా తెలిపారు. అంతేకాకుండా విజయ్ పరిస్థితి విషమం గా ఉందని కూడా ఆమె తెలిపారు.
Dhanush 50: ఓ.. సార్.. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి
ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతని పళ్ళు విరిగిపోయాయని, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ముఖానికి కూడా గట్టి దెబ్బలు తగిలినట్లు చిత్ర బృందంలో యువకుడు చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గర అయిన విజయ్ ఆంటోని.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.