ఆవలింత అనేది ఒక సహజ ప్రక్రియ. నోరు తెరిచి, లోతుగా శ్వాస తీసుకోవడం, ఊపిరితిత్తులను గాలితో నింపడం వంటి అసంకల్పిత ప్రక్రియను ఆవలింత అంటారు.
ఆవలింతకు ఖచ్చితమైన కారణమేదీ లేదు. కానీ ఇది తరచుగా వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే.
నిజానికి ఆవలింత సాధారణంగా నిద్రలేకుంటేనో లేదా బాగా అలసిపోతేనో వస్తుంది. బాగా నీరసంగా అయినప్పుడు, పనిలో బాగా అలసిపోయినప్పుడు, విసుగు వంటి సందర్భాల్లో ఆవలింతలు పక్కాగా వస్తాయి.
అప్పుడప్పుడు ఆవలింతలు రావడం సహజమే. కానీ తరచుగా ఆవలింతలు రావడం మామూలు విషయం కాదు. దీనికి ఏదో బలమైన కారణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆవలింతలు కొన్ని సెకన్ల పాటు ఉంటాయి. కొంతమంది ఆవలిస్తే కళ్ల నుంచి నీరు కారుతుంది. ఈ ఆవలింతలు నిజానికి కొన్ని అనారోగ్య సమస్యల వల్లే తరచుగా ఆవలిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తరచుగా ఆవలించడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది.
క్రమం తప్పకుండా 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పును తప్పిస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి మీ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
కెఫిన్, ఆల్కహాల్ ను తాగడం మానుకోండి. ముఖ్యంగా రాత్రి పూట మందును అతిగా తాగకండి. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టుకుని నిద్రపోకూడదు.
అధిక ఆవలింత చిరాకు కలిగిస్తుంది.ఈ ఆవలింత ద్వారా మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నించడానికి సంకేతంగా సంకేతంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
తరచుగా ఆవలింత రావడం మూర్ఛ లేదా కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణం కూడా కావొచ్చు. అందుకే ఆవలింతలు మరీ ఎక్కువగా వస్తే వెంటనే చెకప్ లు చేయించుకోండి.