Purchase of Electricity: ఛత్తీస్ గడ్ ఒప్పందం వల్ల 2600 కోట్ల నష్టం జరిగిందని విద్యుత్ అధికారి రఘు అన్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్ గడ్ విద్యుత్ కొనుగోళ్ల పై ఎల్.నరసింహారెడ్డి విచారణ కొనసాగుతుంది. విచారణ కమీషన్ ఎల్.నరసింహారెడ్డితో విద్యుత్ నిపుణుడు, అధికారి రఘు భేటి అయ్యారు. కాగా.. విచారణ కమీషన్ ఆఫీసుకు ప్రొఫెసర్ కోదండరాం చేరుకున్నారు. అప్పట్లో విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కోదండరాం, మెంబెర్ గా ఉన్న రఘు ఉన్నట్లు సమాచారం. కోదండరాం, రఘును జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. దీంతో ఇవాళ విచారణకు కోదండరాం, రఘు హజరయ్యారు. అనంతరం విద్యుత్ నిపుణుడు రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్ గడ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాద్రాద్రి అంశాల పై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చామన్నారు. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. ఛత్తీస్ గడ్ ఒప్పందం ఎంఓయు రూటు కాకుండా కాంపిటేటివ్ రూటుకు ఎందుకు వెళ్ళాము అనేది సమాచారం ఇచ్చామన్నారు. ఛత్తీస్ గడ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సప్లై చెయ్యలేదన్నారు.
Read also: B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది..!
ఛత్తీస్ గడ్ ఒప్పందం వల్ల 2600 కోట్ల నష్టం జరిగిందన్నారు. వెయ్యి మేఘా వాట్లు ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందాలు జరిగితే అది సప్లై చెయ్యలేదన్నారు. ఛత్తీస్ ఘడ్ తో మరో 1000 అదనపు వెయ్యి మేఘా వాట్ల విద్యుత్ చేసుకున్నారు…తరువాత తప్పు తెలుసుకొని రద్దు చేసుకోవాలంటే కుదరలేదన్నారు. ఇరు రాష్ట్రాల డిస్కం ల ద్వారా ఒప్పందాలు MOU చేసుకున్నాయన్నారు. ఛత్తీస్ గడ్ ఒప్పందం రెగ్యులేటరీ కమీషన్ ఆమోదం పొందలేదన్నారు. విద్యుత్తు వరద సాకుతో యాదాద్రి భద్రాద్రి కాంపిటేటివ్ రూట్లో నిర్మాణం స్టార్ట్ చేశారన్నారు. కాంపిటేటివ్ టూర్లో వెళ్లకపోవడం వల్ల భారీగా నష్టం జరిగిందన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ లో BHEL 2013-2014 88శాతం ఉంటే…. తరువాత జీరో కు పడిపోయిందన్నారు. BHEL కాంపిటేటివ్ బిడ్డింగ్ పై కాగ్ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందన్నారు. మూడేళ్లలో కంప్లీట్ కావలసిన ప్రాజెక్టు 9 ఏళ్ళు అవుతున్న యాదాద్రి కంప్లీట్ కాలేదన్నారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదని తెలిపారు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
2010లో తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ యంత్రాలను టెక్నాలజీని బిహెచ్ఇఎల్ ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావని మా అభిప్రాయం అన్నారు. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు…సరైన లొకేషన్ కూడా కాదన్నారు. యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుందన్నారు. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారన్నారు. కాంపితేటివ్ బిడ్డింగ్ లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది..కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదన్నారు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ PPA చేయమంటే 7 ఏళ్లుగా చెయ్యలేదన్నారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. 635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు అని తెలిపారు. భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో 9వేలు, యాద్రద్రీ వల్ల ఒక్క రవాణా నష్టం 1600 కోట్లకు పైగా నష్టం జరుగుతుందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారన్నారు.
Minister Atchannaidu: మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు(వీడియో)