Fake Shopping website fraud: ఏదైనా ఓకేషన్ లేదా.. పండుగలు వస్తే చాలు షాపింగ్‌లకు ఎగబతుంటాము. ఇక ఆఫర్లు వస్తే ఆ.. ఆనందమే వేరు. బయటకు వెల్లకుండా ఆన్లైన్లో అయితే 50శాతం ఆఫర్ అంటే చాలు తెగ ఆర్డర్లు ఇచ్చేస్తుంటాము. నచ్చక పోతే ఆన్లైన్లోనే వాపస్ ఇచ్చేయచ్చుగా అనే ఒక్క ఆప్షన్ తో ఆర్డర్లు మీద ఆర్డర్లు ఎగబడుతుంటారు. ఇంట్లో నుంచి కొందరు బయటకు వెల్లలేని పరిస్థితుల్లో ఈఆన్లైన్ ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఇంట్లోనుంచే ఆర్డర్లు ఇస్తూ.. నచ్చకపోతే కూడా వెనక్కు ఇచ్చేయచ్చు కదా.. అనే ఆప్షన్‌తో కూర్చున్న చోటే వస్తుంది కాదా అనే సౌకర్యంతో.. తెగ ఆర్డర్లు ఇస్తుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. వారు ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తున్న తీరును టార్గెట్ చేస్తూ వారి ఖాతాలోంచి డబ్బును మాయం చేస్తున్నారు. ఎదోఓరూపంలో సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలంలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలానికి చెందిన ఓ మహిళ ఖాతాలో రూ. 6.04 లక్షలున్నాయి. ఓరోజు బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలించగా రూ. 2.04 లక్షలు ఉపసంహరించినట్లు ఉంది. ఇటీవల ఆమె పది హేనేళ్ల కుమారుడు ఆన్లైన్లో రెండు చీరలు ఆర్డర్ చేశాడు. ఇంటికొచ్చాక అవి నచ్చకపోవడంతో తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఆన్లైన్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబరు వెతికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి హిందీలో మాట్లాడాడు. చీరలు వెనక్కి తీసుకోవాలంటే తాను పంపిన లింకు తెరిచి వివరాలు నింపాలని సూచించాడు. బాలుడు అలాగే చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి మొత్తం 3 వేర్వేరు లావాదేవీల ద్వారా ఏకంగా వేలల్లో కాదు.. రూ.2.04 లక్షల్లో కొట్టేసినట్లు గుర్తించారు. ఖంగుతిన్న బాధితులు ఈ వ్యవహారంపై తొలుత బాధితురాలు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిష సర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా మరోసారి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు కాస్త జాగ్రత్తగా వుండండంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Kusal Mendis: అత్యంత చెత్త రికార్డ్.. టోటల్‌గా 26