GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్ఎంసీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Hyderabad: హైదరాబాద్ నగరంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లించని ఆస్తులను జప్తు చేసేందుకు సిద్దమవుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు నగరంలో 120 వాణిజ్య ఆస్తులను జప్తు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పన్ను వసూలు లక్ష్యం 2,100 కోట్ల ఆస్తిపన్ను కాగా ఇప్పటి వరకు 1,550 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఇలా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు జీహెచ్ ఎంసీ మరింత దూకుడు పెంచి పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తోంది. 2024-25 సంవత్సరానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ. 7,937 కోట్లు. అసెంబ్లీ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించింది. మిగతా నిధులకు ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ నిధులు అడగాలని చూస్తోంది.
Read also: MP Ganeshamurthi: టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ..!
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఇప్పటికే భారీగా అప్పుల పాలైన జీహెచ్ ఎంసీ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. గత రెండు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించకపోవడంతో వాణిజ్య ఆస్తులకు సీల్ వేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హయత్‌నగర్, గోషామహల్, కూకట్పల్లి సర్కిళ్లలోని ఆస్తులకు సీల్ వేశారు. నివాస భవనాల పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరంలో నాలుగు లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా 3,500 కోట్ల బకాయిలు ఇంకా రాలేదని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్ను, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం రాకపోతే జీతాలు అందని పరిస్థితి నెలకొందని జీహెచ్ ఎంసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బల్దియా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పన్నుల వసూళ్లు, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు చేయడం, బకాయిలపై దృష్టి సారిస్తోంది. ఈ మేరకు పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు.
Tragedy at Weddings: సంగారెడ్డిలో విషాదం.. పెళ్లి ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!