Floods : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా చోట్ల వాగుల్లోకి వెళ్లిన వారు ప్రమాదంలో చిక్కుకుంటున్నారకు. తాజాగా మెదక్ జిల్లాలో 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. మెదక్ మండలం హావేలిఘనపూర్ (మం) రాజీపేట తండా వద్ద వాగులోకి ఆటోలో 8 మంది వెళ్లారు. కానీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆటో కొట్టుకుని పోయింది. ఆటోలో ఉన్న వారు ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే మండలంలోని నాగపూర్ వద్ద కారులో నలుగురు వెళ్తుండగా.. వాగు వేగంగా రావడంతో ప్రమాదంలో పడ్డారు.
Read Also : Kanyakumari Review: కన్యాకుమారి రివ్యూ
కారు వాగులో కొట్టుకుని పోయింది. నలుగురు మాత్రం ప్రాణాలతో వాగులోనే ఉండిపోయారు. చెట్టుని పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయం తెలుసుకుని CS తో ఫోన్ లో మాట్లాడి హెలికాప్టర్ పంపాలని కోరారు. వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. కామారెడ్డి DRF బృందాలు ఇప్పటికే మెదక్ చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి.
Read Also : Ashwin Retirement: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!