ఆ బ్యాంకులు సేఫ్..! ఆర్బీఐ కీలక ప్రకటన

ఎన్నో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.. అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.. ఇక, ఈ మధ్య చాలా బ్యాంకుల విలీనం కూడా జరిగిపోయింది.. అయితే, బ్యాంకుల పరిస్థితిపై ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ), మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కీలక బ్యాంకులుగా పేర్కొంది.. అవి డీ–ఎస్‌ఐబీలు లేదా సంస్థలుగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ..

Read Also: మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఏపీ ఎమ్మెల్యే

అంటే, డీ–ఎస్‌ఐబీలను టీబీటీఎఫ్‌లుగా పరిగణిస్తారు.. అంటే, ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపుగా ఉండదన్నమాట.. అంతే కాదు.. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా.. వాటికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నమాట. అయితే, ఆర్బీఐ కొన్ని కీలక అంశాలను తీసుకుని ఈ ప్రకటన చేసింది.. డీ–ఎస్‌ఐబీ నిర్ధారణ ఫ్రేమ్‌వర్క్‌ 2014 జూలైలో జారీ కాగా.. ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్‌బీఐ డీ–ఎస్‌ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీకి కూడా ఇదే హోదా లభించింది.

Related Articles

Latest Articles