Revanth Reddy: దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మక ద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చింది.. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది.. నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా.. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Animal : యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
అధికారంలోకి రాగానే నర్సాపూర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు.. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్-1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1 …నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు అని ఆయన తెలిపారు. అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు.. కేసీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి కౌంటర్.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మా లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Bigg Boss Telugu 7: అమర్ మాటలకు రెచ్చిపోయిన యావర్.. ఈ వారం నామినేషన్స్ లో వారే?
తండాల్లో మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు. భూమి ఆత్మగౌరవం.. 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం.. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేది.. కేసీఆర్, సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!