బిగ్ బాస్ లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు.. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది.. గత వారం ఎలిమినేషన్ జరగలేదు..నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా నాగార్జున ఇద్దరూ సేఫ్ అన్నారు. యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి తిరిగి ఇచ్చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశారని అన్నారు.. కావున 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు.. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారా అని జనాలు ఆలోచనలకు పదును పెట్టారు..
నెక్స్ట్ వీక్ మరోసారి ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతుంది. అప్పుడు హౌస్లో ఉన్న 10 మంది పోటీ పడి గెలుచుకోవచ్చని చెప్పాడు. కాబట్టి ఎవిక్షన్ పాస్ గెలిచిన కంటెస్టెంట్ కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉన్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవిక్షన్ పాస్ కోసం తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది.. ఇక ఈరోజు నామినేషన్స్ మొదలయ్యాయి.. ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసినవారి బొమ్మ ఉన్న చికెన్ పీస్ తీసుకెళ్లి సింహం నోటిలో పెట్టాలి.
నామినేషన్స్ లో యావర్ ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లు ఉన్నారు. నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అనే కారణాలు చూపుతూ అతన్ని నామినేట్ చేశారు. శివాజీ, ప్రశాంత్ ని కూడా ఇంటి సభ్యులు టార్గెట్ చేశారు.. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియ ముగియగా… 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ప్రియాంక కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు దక్కింది. శోభ కూడా నామినేషన్స్ లో లేదట. అర్జున్, అమర్, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అశ్విని, రతిక, యావర్ నామినేట్ అయ్యారు..శివాజీ, ప్రశాంత్, అమర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. వీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. లేదంటే అర్జున్, యావర్, గౌతమ్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వారం వరకు ఆగాల్సిందే..