Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asus ExpertBook A7: ప్రముఖ టెక్ సంస్థ Asus గ్లోబల్ మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అదే Asus ExpertBook A7. ఇప్పటివరకు 16GB RAM వేరియంట్‌తో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను ఇప్పుడు 8GB RAMతో కూడిన తక్కువ ధర వేరియంట్లోనూ కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో 14 ఇంచుల OLED డిస్ప్లే, Intel Core 5 ప్రాసెసర్, 65Wh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరి ఈ ల్యాప్‌టాప్ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? తెలుసుకుందాం.
Asus ExpertBook A7 ల్యాప్‌టాప్‌ను ప్రస్తుతం యూరప్‌లోని పలు మార్కెట్లలో కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూకేలో దీని ధర £899 (సుమారు రూ.1,11,000)గా ఉంది. బెల్జియం, నెదర్లాండ్స్ మార్కెట్లలో €1,199 (సుమారు రూ.1,24,000) ధరకు విక్రయిస్తున్నారు. జర్మనీలో దీని ధర €1,219 (సుమారు రూ.1,26,000)గా నిర్ణయించారు. కొత్త 8GB RAM వేరియంట్ ధర, గతంలో అందుబాటులో ఉన్న 16GB RAM మోడల్‌తో పోలిస్తే తక్కువగా ఉంది. అయితే భారత్‌లో ఈ ల్యాప్‌టాప్ విడుదల తేదీ, ధరకు సంబంధించి ప్రస్తుత సమాచారం అందుబాటులో లేదు.
Also Read
- Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
- Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
- Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల OLED డిస్ప్లే అందించారు. ఇది 2880 × 1800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రీన్‌పై కదలికలు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. ఈ డిస్ప్లే 100 శాతం DCI-P3 కలర్ గామట్‌ను సపోర్ట్ చేస్తుంది. 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను అందిస్తుంది. కంటెంట్ చూడటం, ఫొటో ఎడిటింగ్ వంటి పనులకు ఈ డిస్ప్లే ఉపయోగకరంగా ఉంటుంది.
Asus ExpertBook A7లో పనితీరు కోసం Intel Core 5 320 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి జతగా 8GB LPDDR5X RAM అందించారు. స్టోరేజ్ కోసం 256GB PCIe Gen 3 SSD ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్ Windows 11 Pro ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే వేగవంతమైన వైర్లెస్ కనెక్టివిటీ కోసం Wi-Fi 6E సపోర్ట్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో హ్యాప్టిక్ టచ్‌ప్యాడ్‌తో పాటు టెక్టైల్ కీబోర్డ్‌ను అందించారు. పవర్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. దీంతో పాస్వర్డ్ నమోదు చేయకుండానే సురక్షితంగా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ల్యాప్‌టాప్ బాడీని ప్రీమియం యూనిబాడీ మెటల్ చాసిస్‌తో రూపొందించారు. బలమైన నిర్మాణంతో పాటు తక్కువ బరువును కూడా కలిగి ఉంది. దీని బరువు కేవలం 1.2 కిలోలు మాత్రమే. Asus ExpertBook A7లో 65Wh బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదని కంపెనీ పేర్కొంది. అయితే వాస్తవ వినియోగంలో బ్యాటరీ పనితీరు, స్క్రీన్ బ్రైట్నెస్, ఉపయోగించే అప్లికేషన్లు, ఇతర సెట్టింగ్స్‌పై ఆధారపడి మారవచ్చు.
తాజావార్తలు
-
Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
-
Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు