NTV Telugu Site icon

Smartphone : మ‌న‌మే టాప్ … త‌గ్గేదే లే..

Whatsapp Image 2022 05 09 At 11.58.49 Am

Whatsapp Image 2022 05 09 At 11.58.49 Am

అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు…ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడివుంటుంది. అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. స్మార్ట్ ఫోన్లను టెక్నాలజీకి ఉపయోగిస్తే మంచిది. అదే మోసాలకు ఉపయోగిస్తే సమాజానికి చేటు జరుగుతుంది.

దేశంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కంలో మ‌హిళ‌లు ముందంజ‌లో వున్నారంటే న‌మ్ముతారా? ఎస్ ముమ్మాటికి ఇది నిజమే. స్మార్ట ఫోన్ వాడ‌కంలో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నారు మ‌న భార‌త దేశ మ‌గువ‌లు. ఇంటి ప‌ని, వంట‌ప‌ని ఏమో గానీ, స్మాట్ ఫోన్‌తో స్మాట్ గా ముందుకు సాగుతున్నారు. పురుషుల‌తో కంటే స్మార్ట్ ఫోన్ వాడ‌కంలో ఓ..టాప్ పొజిష‌న్లో వుండ‌టం మ‌గువ‌ల‌ దూకుడుకి అద్దం ప‌డుతోంది. పురుషుల‌కంటే ర్యాంకుల్లో కాదు స్మార్ట్ ఫోన్ లో కూడా ఒక‌ అడుగు ముందే వున్నారు.

దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో పురుషుల కన్నా మహిళలే ముందంజలో ఉన్నారని ఒక సర్వేలో తేలింది. పురుషులతో పోలిస్తే మహిళలే స్మార్ట్ ఫోన్లపై సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నారని ఆ సర్వే తేటతెల్లం చేసింది. స్మార్ట్‌ఫోన్లో యూట్యూబ్ చూసే విషయంతో పాటు మొబైల్ గేమ్స్‌లో కూడా వారే ముందంజలో ఉన్నారుట. పురుషులతో పోలిస్తే భారత్‌లో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఇంటి పట్టున ఉండటంతో స్మార్ట్ ఫోన్లను తమ వ్యాపకాలుగా మార్చుకున్నారు. మొన్నటి వరకు టెలివిజన్ సీరియల్స్ చూసేవారిలో మహిళల సంఖ్యే ఎక్కువ కాగా, ఇటీవలి కాలంలో అది కాస్త తగ్గుముఖం పట్టింది. చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో సీరియళ్ల నుండి మొబైల్ యూట్యూబ్ లాంటి వాటికి మహిళలు ఆక‌ర్షితుల‌వుతున్నారని మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్, ఐఎంఆర్బీ తయారుచేసిన సంయుక్త నివేదికలో తేలింది.

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఫేస్‌బుక్ వంటి సోష ల్ మీడియాలో మహిళలు ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో స్త్రీలు, పురుషులకు సంబంధించి పలు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కోసం స్మార్ట్‌ఫోన్లను మహిళలు అధికంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల్లో 20 శాతం మేరకు మహిళలు ఉన్నారు. ఆధునిక మహిళలకు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల ఓ ప్రియనేస్తంలా మారింది. జీవన శైలి, సమాచార వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం కోసం పలురకాల ‘యాప్స్’ వాడేందుకు మగువలు స్మార్ట్‌ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా- కనిపించే ప్రతి వస్తువుపైనా మనసు పడి మగువలు షాపింగ్ పేరిట దుబారా ఖర్చు చేస్తుంటారని అంతా అనుకుంటాం. అయితే- ఇంటింటా ఇంటర్నెట్ కనెక్షన్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పురుషుల‌ కంటే మ‌హిళ‌లే అనునిత్యం ఆన్‌లైన్ షాపింగ్‌లో మునిగి తేలుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇంట్లో నుంచి కాలుకదపకుండా మనకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు వెబ్‌సైట్లు వెల్లువెత్తడంతో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల మ‌హిళ‌లు తెగ ముచ్చట పడుతున్నారు. మన దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు పురుషుల‌ కంటే ఆడ‌వాళ్లే ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నారట! బ్రిటన్, అమెరికాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ రెండు దేశాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు సమయం కేటాయించడంలో అతివలే ముందంజలో ఉన్నారు. బ్రిటన్, అమెరికా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో పురుషులు ఆన్‌లైన్ షాపింగ్‌లో రెండు గంటలు గడిపితే మహిళలు అంతకు రెండింతల సమయాన్ని కేటాయిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా షాపింగ్ చేయడం ఓ స‌ర‌దాగా మారిపోయింది మ‌గువ‌కు.

ఇస్టాగ్రామ్‌, యూట్యూబ్ గురించి అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. తిన‌డం , తాగ‌డం ఏమో గానీ అందులో స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డం నేడు ఓ ‘ట్రెండ్’గా మారిపోయింది. కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి, ఫ్యాష‌న్ ప్రపంచంలో తేలుతున్నారు. ఇన్ స్టా లో కామెంట్లు లైక్ లు వస్తున్నాయని ఆనందంతో తబ్బిబ్బయ్యే యువరానులు షోషల్ మీడియాకు దగ్గరవుతూ.. కుటుంబానికి దూరమవుతున్నానని మరిచిపోతూ ఆనందంలో తేలియాడుతున్నారు. షోషల్ మీడియా వాడకంలో ఓరేంజ్ లో ఎదిగిపోతున్నారు. పురుషులు ఒకప్పుడు సోషల్ మీడియాలో బిజీ అవుతూ ఓట్రెండ్ సృష్టిస్తే ఇప్పుడు మగవారికంటే మేము తక్కువ కాదంటూ మగువలు వారికంటే ముందంజలో ఓరికార్డునే సృష్టించారు. దీనికి గల కారణం కరోనా ప్రభావంతో ఇంట్లో వుండి బయటకు వెళ్ళలేక ఇంటర్నెట్ లో గడపడమే నని కొందరు అంటుంటే … అయితే మరికొందరు అంటుంటే మరి పురుషులు కూడా వున్నారు మరి వారెందుకు రాలేదని వాదన.

ఏది ఏమైనా పురుషులతో సమానంగా వున్న మన మహారాణులు సోషల్ మీడియా వాడకంలో దూసుకుపోవడంలో ఓ ట్రెండ్ నే సృష్టించారనే చెప్పొచ్చు. దీంతో సోషల్ మీడియా కంపెనీల ఆనందం ఆకాశాన్నంటుతోంది. మగువలు మహారాణులు మీకు జోహార్లంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పీకే కొత్త పార్టీ ప్రకటనతో సీఎం కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయనున్నారు?