టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగించిన ఇండియా భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ను ప్రయోగించింది. చెన్నైలోని తిరువిడండై నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. రూమి 1ని తమిళనాడు స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ అభివృద్ధి చేశాయి. మొబైల్ లాంచర్ సహాయంతో ప్రారంభించబడింది. 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 PICO ఉపగ్రహాలతో రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ప్రయోగం తర్వాత, హైబ్రిడ్ రాకెట్ పోలోడ్‌ను సముద్రంలోకి విడుదల చేసింది.…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం మూడు ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను నవీకరించిన తర్వాత తాజా జట్టు ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. వన్డే, టీ20ల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వన్డేల పట్టికలో భారత్ 122 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో భారత్ ఆధిక్యాన్ని మూడు నుంచి ఆరు పాయింట్లకు పెంచుకుంది. టాప్ 10లో ఎటువంటి మార్పు లేదు.. కానీ ఐర్లాండ్ జింబాబ్వేను అధిగమించి 11వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా (116)…
ప్రపంచకప్ 2023 మ్యాచ్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది.
ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో…
పోలీసు కస్టడీ మరణాల్లో దేశంలో గుజరాత్ టాప్ స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ప్రకటించింది.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత నిలకడగా ఉన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో నిలకడగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో మాత్రం హైదరాబాద్ నగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల కంటే ముందుంది.
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు…ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడివుంటుంది. అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. స్మార్ట్ ఫోన్లను టెక్నాలజీకి ఉపయోగిస్తే మంచిది. అదే మోసాలకు ఉపయోగిస్తే సమాజానికి చేటు జరుగుతుంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకంలో మహిళలు ముందంజలో వున్నారంటే నమ్ముతారా? ఎస్ ముమ్మాటికి ఇది నిజమే. స్మార్ట ఫోన్ వాడకంలో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నారు మన భారత దేశ మగువలు. ఇంటి పని, వంటపని ఏమో…