Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్‌తో 2GB ఫైల్ షేరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని పలువురు వినియోగదారులు వాట్సాప్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో యూజర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు కమ్యూనిటీ బ్లాగ్ ఆఫ్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్‌తో 2 జీబీ సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను సైతం షేర్ చేసుకోవచ్చు. ముందుగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలోని బీటా యూజర్లకు ప్రవేశపెట్టనుంది. ఈ టెస్టింగ్ విజయవంతం అయితే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. కాగా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తున్న టెలిగ్రామ్ ఇప్పటికే 1.5 జీబీ డేటాను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 2020 నుంచి టెలిగ్రామ్ ఈ అవకాశం వినియోగదారులకు కల్పిస్తోంది. దీంతో కొంతమంది వాట్సాప్ యూజర్లు టెలిగ్రామ్‌కు మారాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!