RRR: బిగ్ బ్రేకింగ్.. ఆస్కార్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’ కు నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR: టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే.. ఉత్తమ నటుడు కేటగిరిలో రామరాజు పాత్రకు చరణ్, కొమరం భీమ్ పాత్రకు తారక్ ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా మూవీ పబ్లిషర్ వెరైటీ చెప్పుకొచ్చింది.
ఇక దీంతో చరణ్ కు ఆస్కార్ వస్తుందని కొందరు.. తారక్ కు ఆస్కార్ వస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వారందరి ఆశలు నీరుగారిపోయాయి. ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ పేరు లేకపోవడం బాధాకరం.. ఆర్ఆర్ఆర్ తో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా చోటు దక్కలేదు. 2023 ఆస్కార్ నామినేషన్ లో గుజరాతీ సినిమా ‘ఛేల్లో షో’ చోటు దక్కించుకొంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఛేల్లో షో’ నామినేట్ అయ్యింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి ఒక చిన్న సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!