సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యింది.. ఇది ట్విట్టర్ యూజర్లకు ముమ్మాటికి శుభవార్తగానే చెప్పాలి.. ఎందుకంటే.. ఆ ఫీచర్ కోసం కొన్ని ఏళ్లుగా డిమాండ్ ఉంది.. ట్వీట్‌లో పదాల సంఖ్యను పెంచుతూ వచ్చిన దాని యాజమాన్యం.. ఎడిట్ ఆపన్షన్ తీసుకురాకపోవడంపై యూజర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.. చాలా మంది.. చాలా రకాలుగా ఎడిట్ ఆప్షన్ కోసం.. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి రిక్వెస్ట్‌లు పెట్టారు.. ఎట్టకేలకు.. ట్విట్టర్ ఎడిట్ ఆప్షన్‌ను పరీక్షించడం ప్రారంభిస్తుంది, కానీ, దానికి ప్రత్యేకంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఎడిట్ బటన్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది.. అంటే, ఇతర ఫీచర్ల మాదిరిగా ఈ ఎంపిక ఉచితం కాదని పరోక్షంగా ట్విట్టర్ ఇంట్ ఇచ్చిందనే చర్చ సాగుతోంది..
Read Also: Bribe: డీసీపీని రూ.500 లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్.. తర్వాత ఏమైందంటే..?
ఎంపిక చేసిన వినియోగదారుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎడిట్ బటన్‌ను పరీక్షిస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.. మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపింది. “మీరు ఎడిట్ చేసిన ట్వీట్‌ను చూసినట్లయితే, మేము ఎడిట్ బటన్‌ను పరీక్షిస్తున్నందున ఇది జరుగుతుంది” అని కంపెనీ ట్వీట్‌లో పేర్కొంది. మీ ట్విటర్ ఖాతాలో ఎడిట్ బటన్ కనిపిస్తే కంగారుపడకండి.. ఈ ఫీచర్ ఇంకా పరీక్షల దశలోనే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపింది.. ముందుగా ఈ ఫీచర్‌ను ట్విట్టర్ బ్లూ యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం యూజర్లకు కనిపించే ఎడిట్ బటన్ పనిచేయదని స్పష్టం చేసింది.
ట్వీట్‌ని ఎడిట్ చేసే ఆప్షన్‌ను మా బృందం అంతర్గతంగా పరీక్షిస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వస్తుంది.. ఇది ఇప్పటి వరకు ఎక్కువగా అభ్యర్థించిన ఫీచర్ అయినందున, మా పురోగతిపై మీకు అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం… మీరు టెస్ట్ గ్రూప్‌లో లేకపోయినా, ప్రతి ఒక్కరూ ట్వీట్ చేస్తే చూడగలుగుతారు. ప్రారంభ రోజులలో ఎడిట్ బటన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండదని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.. అయితే, ఈ ఫీచర్‌లో ట్వీట్ చేసిన 30 నిమిషాల వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఆ తర్వాత ట్వీట్‌లో మార్పులు చేయడం సాధ్యం కాదని సమాచారం.. అలాగే ట్వీట్‌ను ఎడిట్ చేసినట్లు లేబుల్ కూడా కనిపిస్తుందట… ఎడిట్ చేయకముందు ట్వీట్‌ను యూజర్లు చూసే సౌలభ్యం ఉంటుందని తెలుస్తుంది.. ఎడిట్ బటన్ రావడంతో ఎంపిక చేసిన ట్విట్టర్ వినియోగదారులు వారి ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత మార్పులు చేయగలుగుతారు. ఎడిట్ ఫీచర్ తో తమ ట్వీట్‌లోని అక్షరదోషాలు సరిచేసుకునే వీలు ఉంటుంది.. ట్వీట్లకు మరిన్ని జోడించాలనుకునే వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడనుంది.