Samsung Galaxy S25 FE: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్ దగ్గరపడుతుండగా, కంపెనీ తన కొత్త సర్‌ప్రైజ్‌ను టీజ్ చేసింది. గెలాక్సీ S25 కుటుంబానికి చెందిన, కొత్తగా విడుదల కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్ ఇప్పటికే టెక్ లవర్స్‌లో ఆసక్తిని రేపుతోంది. లీక్స్ ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు, స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి.
IP69 రేటింగ్, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు!
కెమెరా సెటప్:
గెలాక్సీ S25 FE వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే 8MP టెలిఫోటో లెన్స్ (3X జూమ్ సపోర్ట్‌తో) ఉంటాయని సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా లభించనుంది. s24 మోడల్‌తో పోలిస్తే ఈసారి కెమెరా వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉంటుందని అర్థమవుతుంది.
స్పెసిఫికేషన్స్:
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ప్రాసెసింగ్ కోసం శాంసంగ్ తన సొంత Exynos 2400 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్ అందించనున్నారు. పవర్ కోసం 4900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని అంచనా.
Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం.. లక్షా పది వేల దిశగా పరుగులు!
ధరలు:
గెలాక్సీ S25 FE భారత మార్కెట్‌లో 8GB + 256GB వెరియంట్ రూ.60,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశముంది. ఇక కలర్ ఆప్షన్స్‌గా నేవీ, వైట్, ఐసీ బ్లూ, జెట్ బ్లాక్ లభించనున్నట్లు లీక్స్ వెల్లడించాయి. అయితే అధికారిక లాంచ్ సమయంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి మిగితా ఫీచర్లు ఎలా ఉంటాయో.