IP69 రేటింగ్, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 15T: భారత మార్కెట్‌లో రియల్‌మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 15T (Realme 15T) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, 60W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తోంది. 10W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ఇందులో MediaTek Dimensity 6400 Max SoC వంటి మంచి ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.
రియల్‌మీ 15T భారత మార్కెట్‌లో మూడు వెరియంట్లలో లాంచ్ అయింది. 8GB + 128GB వెరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించగా, 8GB + 256GB మోడల్ రూ.22,999కు, 12GB + 256GB వెరియంట్ రూ.24,999కు అందుబాటులో ఉంది. ఇక కొనుగోలుదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై EMI ట్రాన్సాక్షన్ ద్వారా రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫుల్ స్వైప్ ట్రాన్సాక్షన్‌పై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. అంతేకాదండోయ్.. జీరో డౌన్‌పేమెంట్‌తో 10 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు

వీటితోపాటు ముందుగా ప్రీ-బుకింగ్ చేసిన వారికి రియల్‌మీ ప్రత్యేక బహుమతిని కూడా అందిస్తోంది. ఇలా ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి Realme Buds T01 TWS ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ షాపింగ్ చేసేవారికి రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, అలాగే తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI లభించనున్నాయి. మొత్తంగా చూస్తే, రియల్‌మీ 15T కేవలం స్పెక్స్‌తోనే కాకుండా ధర, ఆఫర్ల పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఈ మొబైల్ ఫ్లోఇంగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం రంగుల్లో లభ్యం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ e-store తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. మరి ఇన్ని ఆఫర్స్ ఉన్న ఈ మొబైల్ ఫీచర్లను ఒకసారి చూసేద్దామా..
ENG vs SA: వరల్డ్ నెం.1 బౌలర్ దెబ్బకి కుప్పకూలిన ఇంగ్లాండ్.. 49 పరుగులకే 8 వికెట్స్!

ప్రధాన ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.57 ఇంచ్ Full HD+ AMOLED (4,000 nits బ్రైట్నెస్, 2,160Hz PWM డిమ్మింగ్)
ప్రాసెసర్: 6nm MediaTek Dimensity 6400 Max SoC
స్టోరేజ్: 12GB RAM + 256GB స్టోరేజ్ వరకు
కెమెరా: రియర్ గా 50MP ప్రైమరీ + 2MP సెకండరీగా, ఫ్రంట్ 50MP సెల్ఫీ కెమెరా.. రెండు కెమేరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.
కూలింగ్ సిస్టమ్: 6,050 sq mm AirFlow Vapour Chamber + 13,774 sq mm గ్రాఫైట్ షీట్
బ్యాటరీ: 7,000mAh, 60W SuperVOOC + 10W రివర్స్ చార్జింగ్
సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
కనెక్టివిటీ: 5G, 4G, Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C
డిజైన్: 7.79mm మందం, 181 గ్రాములు బరువు
రేటింగ్: IP66, IP68, IP69 (డస్ట్ & వాటర్ రెసిస్టెంట్)
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!