మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. ఫ్లాష్ మెమరీ కొరత.. ధరల పెరుగుదలకు దారితీసిందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీరు సగం కంటే తక్కువ ధరకే శక్తివంతమైన శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ (Samsung Galaxy S24 FE) మోడల్‌ను మీరు 28 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం రూ.59,999 ( 8జీబీ+128జీబీ) ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.28,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కి అందుబాటులో ఉంది. అంటే మీకు 46 శాతం తగ్గింపు లభిస్తోంది. మీకు బ్యాంక్ ఆఫర్ కూడా అనుదుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ.4,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ ఫోన్ ధర రూ.27,999కి తగ్గుతుంది. రూ.24,600 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్ వర్తిస్తే.. గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ రూ.3,399కి మీ సొంతం అవుతుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ ఉండకూడదు.
గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ ఫీచర్స్:
# ఆండ్రాయిడ్ 14 వన్‌యూఐ 6.1
# 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్
# ఐపీ 68 రేటింగ్
# ఎగ్జినోస్ 2400ఈ ప్రాసెసర్
# 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్
# సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా
# 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్