చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ ఈరోజు భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘వన్‌ప్లస్ 15’ పేరుతో లాంచ్ కానుంది. ఈ 5జీ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. వన్‌ప్లస్ 15లో ఆకట్టుకునే ఫీచర్లను, అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అంతేకాదు 7300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ కంపెనీ స్వయంగా కొన్ని ఫీచర్లను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఈవెంట్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ సహా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లాంచ్ అయిన వెంటనే రాత్రి 8 గంటలకు వన్‌ప్లస్ 15 సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్స్ అమెజాన్ ఇండియా సహా అధికారిక వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ధర డీటెయిల్స్ లీక్ అయ్యాయి. 12GB+256GB వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. దీనిపై నేటి సాయంత్రం క్లారిటీ రానుంది. వన్‌ప్లస్ 13 ధర రూ.69,999తో లాంచ్ అయింది. మధ్యలో వన్‌ప్లస్ 14ను కంపెనీ స్కిప్ చేసింది.

వన్‌ప్లస్ ఇప్పటికే వన్‌ప్లస్ 15లో (స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5) అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్‌సెట్ వాడమని పేర్కొంది. ఈ ప్రాసెసర్ రాబోయే రోజుల్లో ఇతర హ్యాండ్‌సెట్‌లలో రానుంది. చైనీస్ వేరియంట్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల BOE X3 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్‌కు చెందిన అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ అందించబడింది. అడ్రినో 840 GPU, LPDDR5x RAM కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ 15 ఫోన్ IP68 రేటింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. ఇది ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. 50 ఎంపీ సోనీ IMX906 OIS ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్స్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 32 ఎంపీ సోనీ IMX709 సెన్సర్ ఇచ్చారు. భారత్ వేరియంట్లో కూడా ఇవే ఫీచర్స్ ఉండనున్నాయి.
