కస్టమర్స్‌ను సంతృప్తి పరిచేందుకు సామ్ సంగ్ (SAMSUNG) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో తమ ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకువస్తోంది. అయితే సామ్‌సంగ్ సోమవారం తన ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఇందులో S పెన్ ఫంక్షనాలిటీతో Galaxy Book2 Pro 360ని, 5G టెక్నాలజీతో ఉన్న Galaxy Book2 Pro ను పరిచయం చేసింది. అంతేకాకుండా ఈ ల్యాప్‌టాప్‌లు 1080p ఫుల్ హెచ్‌డీ(FHD) వెబ్‌క్యామ్‌లు కలిగి ఉన్నాయి. Galaxy Book2 Pro సిరీస్‌లోని రెండు ల్యాప్‌టాప్‌లు అధునాతన పనితీరుతో అల్ట్రా-పోర్టబుల్ డిజైన్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
Galaxy Book2 Pro గ్రాఫైట్ మరియు సిల్వర్ రంగుల్లో లభ్యం కాగా, Galaxy Book2 Pro 360 బుర్గుండి, గ్రాఫైట్ మరియు సిల్వర్ ఫినిషింగ్‌లలో అందుబాటులో ఉంటుంది. సైబర్-దాడుల నుండి రక్షణను పెంచడానికి Windows 11లో మెరుగైన స్థాయి రక్షణ కోసం Microsoft యొక్క సురక్షిత-కోర్ PCతో Galaxy Book2 Pro సిరీస్ మొదటి వినియోగదారు PC లైనప్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
గరిష్టంగా 21 గంటల బ్యాటరీతో, Galaxy Book2 Pro సిరీస్ సూపర్-ఫాస్ట్ USB టైప్-C యూనివర్సల్ ఛార్జర్‌ను అందిస్తుంది. Galaxy Book2 Pro సిరీస్‌లో సరికొత్త 12వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లు ఉన్నాయి. స్టూడియో మోడ్ ఆటో ఫ్రేమింగ్, కొత్త బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ మరియు ఫేస్ ఎఫెక్ట్ టూల్‌తో సహా అనేక రకాల కొత్త ఫీచర్‌లతో కూడా అప్‌గ్రేడ్ చేయబడింది. Galaxy Book2 ప్రో సిరీస్ AKG మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంది.