REDMI K90 Pro Max: షియోమీ (Xiaomi) తాజాగా REDMI K90 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. REDMI K90 Pro Max లో 6.9 అంగుళాల 2K AMOLED భారీ ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, 2560Hz ఇన్‌స్టాంటేనియస్ టచ్ శాంప్లింగ్ రేట్, కంటికి ఉపశమనం కలిగించే పూర్తి బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇందులో AI మోడల్ ప్రీ ట్రైనింగ్‌తో PC స్థాయి ఇమేజ్ క్వాలిటీని అందించే D2 ఇండిపెండెంట్ గ్రాఫిక్స్ చిప్ ఉంది. ఇది డైనమిక్ ఇంటర్‌పోలేషన్ టెక్నాలజీ ద్వారా కదలికలను మరింత సున్నితంగా మారుస్తుంది. వేడిని సమర్థవంతంగా తగ్గించడానికి షియోమీ అతిపెద్ద 6700mm² 3D ఐస్ సీల్డ్ హీట్‌సింక్ ను వాడింది. ఇది గేమింగ్ వంటి ఎక్కువ లోడ్ ఉన్న సమయాల్లో కూడా ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
REDMI K90 Pro Max ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 50MP 1/1.31″ లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ (Xiaomi 17 లో ఉన్న సెన్సార్), OIS, 13.5EV హై డైనమిక్ రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ 5x పెరిస్కోప్ లెన్స్ రెడ్ మీ ఫోన్లలో మొదటిసారిగా అందించబడింది. ఈ లెన్స్ 30cm టెలి మాక్రో ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఆడియో కోసం ఇది ఒక ఓవర్ సైజ్డ్ స్వతంత్ర వూఫర్‌తో కలిసి పనిచేసే 1115F అల్ట్రా లీనియర్ సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇది 2.1 స్టీరియో సౌండ్ ఫీల్డ్‌ను సృష్టించి, BOSE ట్యూనింగ్‌తో అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
Smriti-Pratika: అదరగొట్టిన స్మృతి, ప్రతీక.. ప్రపంచ రికార్డును సమం!
ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌తో కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. బ్లూ కలర్ వేరియంట్ నీలిరంగు జీన్స్‌ను పోలి ఉండే బ్యాక్ కవర్‌ను కలిగి ఉంది. దీనిని నాల్గో తరం నానో లెదర్ టెక్నాలజీతో రూపొందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 7560mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, రెడ్ మీ ఫోన్లలో మొదటిసారిగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఛార్జింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన Xiaomi Surge P3 స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ చిప్ + G2 బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్‌ను ఉపయోగించారు. అలాగే, కస్టమైజ్డ్ డిజైన్‌తో కూడిన ‘Automobili Lamborghini SQUADRA CORSE’ ఛాంపియన్ ఎడిషన్ కూడా 16GB + 1TB వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
REDMI K90 Pro Max స్మార్ట్‌ఫోన్ ధరల విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ అయిన 12GB + 256GB ధర 3999 యువాన్లు (రూ. 49,310)గా నిర్ణయించారు. ఇక 12GB + 512GB వేరియంట్ 4499 యువాన్ల (రూ. 55,465)కు లభిస్తుంది. అదే విధంగా, 16GB + 512GB వేరియంట్ ధర 4799 యువాన్లు (రూ. 59,160)గా ఉంది. ఇక టాప్ ఎండ్ రెగ్యులర్ వేరియంట్ అయిన 16GB + 1TB ధర 5299 యువాన్లు (రూ. 65,325)గా ఉంది. ప్రత్యేకంగా 16GB + 1TB ఛాంపియన్ లంబోర్ఘిని SQUADRA CORSE ఎడిషన్ ధరను 5499 యువాన్లుగా (రూ. 67,795) నిర్ణయించారు. ఈ ధరలతో ఈ ఫోన్ చైనీస్ మార్కెట్‌లో విక్రయాలు ప్రారంభించింది.