Realme P4 Pro 5G: భారతీయ మార్కెట్లో రియల్‌మీ తన P4 5G సిరీస్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మీ P4 (Realme P4 5G), రియల్‌మీ P4 ప్రో (Realme P4 Pro 5G) లను విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ 5G ఫోన్ 7,000 mAh భారీ బ్యాటరీ, మెరుగైన ప్రదర్శన, క్లాస్-లీడింగ్ కెమెరా సామర్థ్యాలతో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్న రియల్‌మీ P4 ప్రో 5G మొబైల్ ముఖ్యాంశాలు చూసేద్దామా..
డిస్‌ప్లే & డిజైన్:
ఈ కొత్త Realme P4 Pro 5G లో 6.8-inch Quad-curved AMOLED 4D Curve+ డిస్ప్లే అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 6500 nits పీక్ బ్రైట్‌నెస్, 100% DCI-P3 కలర్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గోరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ ఫీచర్స్ తో మొబైల్ చూపే విజువల్ అనుభవం చాలా బాగా ఉంటుంది.

Film Workers Strike: సినీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..!
చిప్‌సెట్:
ఈ మొబైల్ లో అడ్వాన్స్డ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ను అందించారు. అలాగే ఇందులో HyperVision AI GPU (Pixelworks X7 Gen2లో నిర్మితమైనది) గ్రాఫిక్ ప్రాసెసింగ్ ను అందించారు.
బ్యాటరీ, చార్జింగ్:
ఇక ఈ మొబైల్ లో హైలెట్ గా చెప్పుకొనేదిగా ఇందులోని భారీ 7,000 mAh బ్యాటరీ. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దత్తుతో పాటు, 10W రివర్స్ ఛార్జింగ్ సమకూర్చింది. గేమింగ్ లేదా ఇంటెన్సివ్ వాడకానికి ఇది ఇక్కువ సేపు పనికి వస్తుంది.

కెమెరా సెటప్:
Realme P4 Pro 5G వెనుక భాగంలో 50MP Sony IMX896 OIS ప్రధాన కెమెరా + 8MP అల్ట్రావైడ్ అందించిన Dual-camera ఆరే ఉంది. అలాగే ముందు భాగంలో 50MP OV50D సెన్సార్ ఉంది. 4K@60fps వీడియో కనిపించే సామర్థ్యం కూడా ఇది కలిగి ఉంది.
Asia Cup 2025: బెంచ్‌లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?
అదనపు ఫీచర్లు:
ఈ మొబైల్ లో IP65 + IP66 రేటింగ్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, డ్యూయల్ స్టీరియో సపీకర్స్, Wi-Fi 6, USB-C, Bluetooth 5.4, GPS, IR బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

అప్‌డేట్ పాలసీ:
ఈ కొత్త మొబైల్ కు 3 ప్రధాన Android OS అప్‌డేట్లు, అలాగే 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు అందజేయనున్నట్లు రియల్‌మీ హామీ ఇచ్చింది.
ధర & లభ్యత:
రియల్‌మీ P4 Pro 5G ఫోన్‌ను కంపెనీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 8GB + 128GB మోడల్ ధర రూ.24,999గా నిర్ణయించగా, 8GB + 256GB మోడల్ రూ.26,999కి, 12GB + 256GB మోడల్ రూ.28,999కి లభించనుంది. ఇక లాంచ్ లో భాగంగా కొనుగోలుదారుల కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా వినియోగదారులకు అందించనుంది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 2025 ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు విక్రయానికి సిద్ధం కానుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.