Oppo Reno 15: Oppo Reno 15 సిరీస్ చైనాలో తాజాగా విడుదలైంది. నవంబర్ 2025లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో (Oppo) ఈ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో Reno 15 Pro, Reno 15 అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటికి MediaTek Dimensity చిప్‌సెట్‌తో పాటు, గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లతో విడుదలయ్యాయి. రెండు ఫోన్లలోనూ స్క్వేర్ మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో కలిసి అందించబడింది. వివిధ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు నవంబర్ 21 నుంచి చైనాలో అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.
HIV Cases: పారిశ్రామిక వాడలో రోజురోజుకు పెరుగు తున్న హెచ్ ఐవీ కేసులు..
ఇక వీటి ధరల విషయానికి వస్తే, Reno 15 Pro సిరీస్‌లో 12GB + 256GB మోడల్ ధర CNY 3,699 (రూ.46,000)గా నిర్ణయించబడగా, 12GB + 512GB వేరియంట్ CNY 3,999 (రూ.50,000)కి లభిస్తుంది. 16GB + 512GB మోడల్ CNY 4,299 (రూ.54,000) కాగా, టాప్-ఎండ్ 16GB + 1TB వేరియంట్ CNY 4,799 (రూ.60,000)గా ఉంది. ఇక Reno 15 మోడల్ 12GB + 256GB వేరియంట్ CNY 2,999 (రూ.37,000) నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్లు CNY 3,299 నుండి CNY 3,599 (రూ.41,000–రూ.45,000) మధ్య లభిస్తాయి. టాప్ మోడల్ 16GB + 1TB ధర CNY 3,999 (రూ.50,000)గా ఉంది. Reno 15 Pro స్టార్ లైట్ బౌ, హనీ గోల్డ్, కానేలే బ్రౌన్ కలర్లలో, Reno 15 మాత్రం అరోరా బ్లూ, కానేలే బ్రౌన్, స్టార్ లైట్ బౌ, సాంగ్ యుకీ ఎడిషన్ రంగులలో లభిస్తుంది.
ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే Reno 15 Proలో 6.78 ఇంచుల ఫుల్ HD+ Flexible AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 nits పీక్ బ్రైట్‌నెస్, 95.5% స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి ఫీచర్లు ఉన్నాయి. Reno 15లో 6.32 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఉండగా.. ఇది 93.4% స్క్రీన్ రేషియోతో, 460ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తోంది. పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఫోన్లలోనూ MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 3.25GHz క్లాక్ స్పీడ్‌తో 1 Prime, 3 Performance, 4 ఎఫిసీఎంసీ కోర్ల నిర్మాణంలో రూపొందించబడింది. ARM G720 MC7 GPUతో కలిపి మంచి గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరును అందిస్తుంది.
భారత మార్కెట్‌లోకి నేడు అడుగుపెట్టనున్న Oppo Find X9 సిరీస్.. ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
కెమెరా విభాగంలో కూడా Reno 15 సిరీస్ అద్భుతం అనే చెప్పాలి. 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ సెటప్ 120x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. అలాగే ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఆటోఫోకస్ సపోర్ట్‌తో ఇవ్వబడింది. 4K@60fps వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా Reno 15 సిరీస్‌లో ప్రాక్సిమిటీ, అంబియెంట్ లైట్, కలర్ టెంపరేచర్ సెన్సర్లు, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, IR బ్లాస్టర్, హాల్ సెన్సర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇన్-డిస్‌ప్లేలో ఏర్పాటు చేయబడింది. 5G, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.