Oppo Enco Buds 3 Pro+: ఒప్పో సంస్థ భారత మార్కెట్లో మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్(TWS)ను విడుదల చేసింది. ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో+ (Oppo Enco Buds 3 Pro+) మోడల్ Find X9 సిరీస్‌తో పాటు లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్స్‌ను ఉపయోగించడంతో స్పష్టమైన, శక్తివంతమైన బాస్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ముఖ్యంగా ఈ మోడల్‌లో 32dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను అందించడం ప్రత్యేకం. శబ్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ వీటి ANC ఫీచర్ మంచి నాయిస్ ఐసోలేషన్‌ను ఇవ్వనుంది.
Jio Gemini Pro plan: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 18 నెలల పాటు ఫ్రీగా జెమిని ప్రో ప్లాన్
బ్యాటరీ పరంగా చూస్తే ఇవి తమ సెగ్మెంట్‌లో అత్యుత్తమం. ANC ఆఫ్ చేసి ఉంచితే మొత్తం 43 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని, ANC ఆన్‌లో 28 గంటల వరకు బ్యాకప్‌ను అందిస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్‌లో 58mAh బ్యాటరీ, కేస్‌లో 440mAh బ్యాటరీ ఉండడంతో నిరంతర వినోదాన్ని పొందవచ్చు. ఇయర్‌బడ్స్ ఒక్కటే ANC ఆన్‌లో ఎనిమిది గంటలు, ANC లేకుండా పన్నెండు గంటలు పనిచేస్తాయి. USB టైప్-C ఆధారిత ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 11 గంటల ప్లేబ్యాక్ పొందడం ఈ మోడల్ ప్రత్యేకత. ఇక ధర విషయానికి వస్తే భారత మార్కెట్లో రూ.2,099 ధరగా ఒప్పో నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్‌గా వినియోగదారులు వీటిని రూ. 1,899 ధరకే పొందవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, సోనిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ నవంబర్ 21 నుండి Oppo స్టోర్లు, రిటైల్ భాగస్వాములు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు.
Semiyarka: అద్భుతం.. బయటపడ్డ 3,600 ఏళ్ల నాటి కంచు యుగం నగరం..!
IP55 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ద్వారా పరిసర శబ్దాలను కూడా వినేందుకు వీలు ఉండటం, రోడ్డు ప్రయాణాలు లేదా కార్యాలయాల్లో ఉపయోగించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. డిజైన్ పరంగా ఇవి తేలికగా మరియు మన్నికగా ఉండేలా రూపొందించారు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.2 గ్రాములు మాత్రమే ఉండడంతో దీర్ఘకాలం పెట్టుకున్నా అసౌకర్యం ఉండదు. మొత్తం కేస్‌తో కలిపి బరువు 46.2 గ్రాములు మాత్రమే.