Semiyarka: కజకిస్థాన్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈశాన్య కజకిస్థాన్‌లో క్రీ.పూ. 1600 నాటి కంచు యుగం (Late Bronze Age) నాటి పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని సెమియార్కా (Semiyarka) అని పిలుస్తున్నారు. యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ పురాతన నగరం సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. డర్హామ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), కజకిస్థాన్‌లోని తోరైఘిరోవ్ విశ్వవిద్యాలయం నుండి ఎనిమిది మంది పరిశోధకులు ఈ నివేదికను సిద్ధం చేశారు.
70W డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్స్‌తో Kodak MotionX series లాంచ్.. ధర ఎంతంటే..?
సెమియార్కాను నిజానికి 2000ల ప్రారంభంలో తోరైఘిరోవ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. అప్పటికే దీర్ఘచతురస్రాకారపు మట్టి పని నిర్మాణాలు, కంచు యుగం నాటి కుండలు, లోహపు కళాఖండాల ఆధారాలు కనుగొన్నారు. అయితే తాజాగా “మొట్టమొదటి వివరణాత్మక పురావస్తు సర్వే”ను విడుదల చేశారు.
ఇందుకు సంబంధించి యూసీఎల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్, ఈ నివేదిక రచయితలలో ఒకరైన మిల్జానా రదివోజేవిచ్ మాట్లాడుతూ.. ఇది దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత విశేషమైన పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటని పేర్కొన్నారు. అలాగే సెమియార్కా స్టెప్పీ సమాజాల గురించి మనం ఆలోచించే విధానాన్ని మారుస్తుందని.. ఇది స్టెప్పీ ప్రాంతంలో అసలైన ‘పట్టణ కేంద్రం’గా ఉండేదని ఆయన తెలిపారు. ఇర్తిష్ నదికి అభిముఖంగా ఉండడమే కాకుండా.. ప్రస్తుత రష్యా వరకు విస్తరించి గడ్డి భూములతో కూడిన విశాలమైన ప్రాంతం అయిన కజఖ్ స్టెప్పీపై సెమియార్కా ఉందని పేర్కొన్నారు.
Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
సెమియార్కాని “ఏడు లోయల నగరం” అని కూడా పిలుస్తారు. నివేదిక ప్రకారం.. ఇది ఆన్-సైట్ టిన్-బ్రాంజ్ ఉత్పత్తితో కూడిన మొదటి పెద్ద స్టెప్పీ కేంద్రంగా గుర్తింపు పొందింది. సెమియార్కా వ్యవస్థీకృత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అత్యంత వ్యవస్థీకృత లోహపు కేంద్రం అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. స్టెప్పీ సమాజాలలో వ్యవస్థీకృత లోహ ఆర్థిక వ్యవస్థలు లేవనే ఊహలను సవాలు చేస్తున్నాయి. అయితే సెమియార్కా సమాజం లోహపు వస్తువులను ఎలా తయారు చేసింది..? ఇతర సమీప సమూహాలతో ఎలా వ్యాపారం చేసిందనే దానిపై పరిశోధన కొనసాగించడానికి ఈ బృందం ప్రయత్నిస్తుంది.