ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. యూత్ కు అవసరమయ్యే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలకే మొబైల్స్ ను అందిస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో A79 5G వచ్చేసింది.. ఎ-సిరీస్ లైనప్‌లో సరికొత్త ఆఫర్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.. ఫీచర్స్, కాస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సీటీ 6020 SoC ద్వారా ఆధారితంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఉంటుంది. ఒప్పో A79 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌తో కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు 27 గంటలు వస్తుందట..
6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో గరిష్టంగా 90Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డెన్సిటీ, 6150నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 9150 నిట్స్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 7nm మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC, 8GB LPDDR4X RAM, 128GB UFS2.2 స్టోరేజ్‌తో అందిస్తుంది.. అదే విధంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఒప్పో A79 5G ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది…
ధర విషయానికొస్తే.. ఒప్పో A79 5G ఫోన్ సింగిల్ 8GB ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999, గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. ప్రస్తుతం ఒప్పో ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి… ఆన్లైన్లో కొన్ని బ్యాంకులు ఆఫర్స్ ను కూడా ఇస్తున్నాయి..