ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో మార్కెట్ లోకి మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. ఒప్పో ఏ59 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను శుక్రవారం లాంచ్ కాగా.. మార్కెట్ లో డిసెంబర్ 25 వ తేదీని అందుబాటులోకి రానుంది.. ఒప్పో అధికారిక వెబ్ సైట్ తో పాటుగా, అదే రోజూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.
ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.. అలాగే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 13.1పై పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో ముందు కెమెరాను కూడా అందించింది..
ఒప్పో ఏ59 5జీ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 30 నిమిషాల్లో 52 శాతం ఛార్జింగ్ అవుతుందని చెబుతున్నారు.. ఇక ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. ఇక కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు..