144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Turbo 6X and Turbo 6X Pro Launched: వన్ ప్లస్ (OnePlus) నుండి OnePlus Turbo 6X అండ్ OnePlus Turbo 6X Pro స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త సిరీస్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, మెరుగైన పనితీరుతో ఆకట్టుకునేలా ఉన్నాయి.
OnePlus Turbo 6X:
OnePlus Turbo 6Xలో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. డిమ్మింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల స్క్రీన్ ఫ్లికరింగ్ తగ్గుతుంది. చేతులకు నీరు లేదా నూనె ఉన్నా, గ్లోవ్స్ ధరించినా టచ్ సజావుగా పనిచేసేలా ప్రత్యేక టచ్ ఆప్టిమైజేషన్ ఫీచర్లు అందించారు. ఈ ఫోన్‌కు MediaTek Dimensity 7360 SUPER ప్రాసెసర్ కలిగి ఉంది. 7000mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 2TB వరకు TF కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం కల్పించడం మరో ప్రత్యేకత.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
OnePlus Turbo 6X Pro:
Turbo 6X Proలో 6.78 అంగుళాల 1.5K Samsung AMOLED డిస్ప్లేను ఉపయోగించారు. M14 ల్యూమినస్ మెటీరియల్‌తో రూపొందించిన ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. పూర్తి స్థాయి DC డిమ్మింగ్, ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీలను కూడా ఇందులో చేర్చారు. ఈ ఫోన్‌కు MediaTek Dimensity 7400 SUPER చిప్సెట్ శక్తినిస్తోంది. 360 డిగ్రీల సరౌండ్ యాంటెన్నా డిజైన్ వల్ల మెరుగైన నెట్వర్క్ సిగ్నల్ అందుతుందని కంపెనీ తెలిపింది. ColorOS 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ ఆరు సంవత్సరాల పాటు స్మూత్ పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Turbo 6X Proలో 8000mAh బ్యాటరీని అందించారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 29 గంటల పాటు షార్ట్ వీడియోలు చూడవచ్చు. అలాగే 17 గంటల నావిగేషన్ లేదా 8 గంటల నిరంతర గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇంకా OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరాను అందించారు. అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. లైవ్ ఫోటో, సాఫ్ట్ లైట్ పోర్ట్రెయిట్, వింటేజ్ ఫిల్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
AI ట్రాన్స్లేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI వాయిస్ నోట్స్ వంటి AI ఆధారిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక కమాండ్లు, సైలెంట్ గేమ్ లాంచ్, వాయిస్ ఛేంజర్ వంటి ఫీచర్లను కూడా అందించారు. ఇంకా ఇది IP66, IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లను పొందింది. అంతేకాకుండా 7 మిలిటరీ గ్రేడ్ టెస్టులను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.
ధరలు:
OnePlus Turbo 6X:
8GB + 128GB – 1899 యువాన్ (రూ.26,700)
8GB + 256GB – 1999 యువాన్ (రూ.28,100)
12GB + 256GB – 2299 యువాన్ (రూ.32,300)
OnePlus Turbo 6X Pro:
8GB + 128GB – 1999 యువాన్ (రూ.28,100)
8GB + 256GB – 2099 యువాన్ (రూ.29,500)
12GB + 256GB – 2399 యువాన్ (రూ.33,700)
OnePlus Turbo 6X & Turbo 6X Pro స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. జూన్ 15 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!