స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2టీ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. జూన్ 27న వస్తుందని తాజాగా లాంచ్ డేట్ లీక్ అయింది. యూరప్‌లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటీలో 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ధర రూ.28,999(355 యూరోలు), 12జీబీ+ 128జీ స్టోరేజీ రూ.31,999(390 యూరోలు)గా నిర్ణయించారు. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో రూ.25 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
ఫీచర్లు ఇలా..: వన్‌ప్లస్ నార్డ్ 2టీ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 80w సూపర్ వూక్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుండటంతో నార్డ్ 2 కంటే నార్డ్ 2టీ మెరుగ్గా ఉందని ఓ నివేదిక తెలిపింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.5 అంగులాల హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. హెచ్‌డీఆర్10+సపోర్ట్, కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజీ వరకు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 45mahగా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికొస్తే మూడు కెమెరాలతో ఇది అందుబాటులోకి రానుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50ఎంపీగా ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందువైపు 32ఎంపీ కెమెరా కూడా అందించారు.