మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్‌లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T కోసం టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మనదేశంలో OnePlus బ్రాండ్ కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.
OnePlus Nord 2T స్పెసిఫికేషన్స్
*6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో
* 90Hz రిఫ్రెష్ రేట్ పూర్తి HD+ రిజల్యూషన్
*పంచ్ కటౌట్ తో కెమేరా
* Nord 2T MediaTek డైమెన్సిటీ 1300 SoC
* SoC 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్
* మైక్రో SD కార్డ్ లేదా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అవకాశం లేదు
*4500 mAh బ్యాటరీ
* అప్‌గ్రేడ్ చేసిన 80W ఫాస్ట్ ఛార్జింగ్
* 12GB RAM, 256GB వరకు స్టోరేజీ
* ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్ OS 12
* ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతు
* 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా సెన్సార్
* 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్
* సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం Nord 2Tలో 32MP ఫ్రంట్ కెమెరా సెన్సార్
Smartphone : మనమే టాప్ … తగ్గేదే లే..