OnePlus 13 Price Slashed in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ సరికొత్త ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇటీవల వన్‌ప్లస్ 15ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కొత్త ఫోన్ పైనే ఉంది. అయితే మీరు తక్కువ ధరకు శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. వన్‌ప్లస్ 13 (OnePlus 13) మంచి ఎంపిక అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత వన్‌ప్లస్ 13ను రూ.60,000 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
వన్‌ప్లస్ 13 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.69,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.63,975కి అందుబాటులో ఉంది. అంటే మీకు రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే.. అదనంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లు అన్ని కలిపితే.. వన్‌ప్లస్ 13 రూ.60,000 కంటే తక్కువగా మీ సొంతం అవుతుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో నెలకు రూ.2,250 కట్టి వన్‌ప్లస్ 13ను కొనేసుకోవచ్చు. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి రూ.50,200 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. మీది టాప్ ఎండ్ ఫోన్ అయుండి.. సూపర్ కండిషన్‌లో ఉంటే మొత్తం ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. అప్పుడు రూ.10 వేలకే వన్‌ప్లస్ 13ను కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు. ఆఫర్స్ ఉన్నపుడే కొనేసుకుంటే బెటర్.
Also Read: BCCI vs BCB: భారత్‌కు బంగ్లాదేశ్ జట్టును పంపం.. మేం ఐసీసీతోనే తేల్చుకుంటాం!
వన్‌ప్లస్ 13 ఫీచర్స్:
# 6.82 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేట్
# 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# ఏఐ పవర్డ్ ఆక్సిజన్ 15 ఆపరేటింగ్ సిస్టమ్
# స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్
# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్, 50 ఎంపీ అల్ట్రావైడ్, 50 ఎంపీ ట్రైప్రిజమ్ టెలిఫొటో
# 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్