Electric Scooters: నాలుగో స్థానానికి ఓలా ఢమాల్.. ఫస్ట్ ప్లేస్‌లో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజల్లో విద్యుత్ వాహనాల మోజు పెరుగుతోంది. దీనికితోడు చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. ఈ వాహనాల కోనుగోళ్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాలు కంపెనీలు విరివిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో ఒకదానికి మంచి మరొక స్కూటర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.
ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలు తయారుచేసే కంపెనీల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో తెలిపే గణాంకాలు బయటకొచ్చాయి. జూన్ నెలలో ఎన్ని వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయన్న వివరాల్ని ‘వాహన్’ వెలువరించింది. ఇందులో ఒకినావా సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి.. ఈ రేసులో ఏప్రిల్ వరకూ ఓలా ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో ఉండేది. కానీ, మే నెలలో తొలిసారి అగ్రస్థానం కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు జూన్‌లో కేవలం 5753 వాహన రిజిస్ట్రేషన్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఒకినావా 6782 రిజిస్ట్రేషన్లతో తొలి స్థానంలో దక్కించుకోగా.. ఏంపియర్ (6199), హీరో ఎలక్ట్రిక్ (6049) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఓలా తర్వాత ఏథర్, రివోల్డ్, ప్యూర్ ఈవీ, బెన్లింగ్ కంపెనీలున్నాయి.
Also Read
- OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
- OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
- Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్‌పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
- Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
కంపెనీల విషయాన్ని పక్కనపెట్టి ఓవరాల్ ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ లెక్కలు చూసుకుంటే.. జూన్ నెలలో మొత్తం 32807 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. మే నెలలో 32680 వరకూ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. నిజానికి.. ఇప్పుడు ట్రెండ్‌లో ఈ సంఖ్య బాగా పెరగాల్సింది. కానీ, బ్యాటరీల లోపం వల్ల వాహనాలు కాలిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటుండడంతో, ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్లు పెద్దగా పెరగడం లేదని నిపుణులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!