NTV Telugu Site icon

Motorola G45: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్

Motorola G45 5g

Motorola G45 5g

మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్‌ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.11,000 కంటే తక్కువ ధరకే ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మీరు 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. అలాగే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్‌ను రూ.11,300 కొనవచ్చు. ఈ ఆఫర్ సేల్ నవంబర్ 7 వరకు ఉంది. మోటరోలా ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

Read Also: PM Modi: 3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ..

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
కంపెనీ ఈ ఫోన్‌లో 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ట ప్రకాశం స్థాయి 500 నిట్‌లు. డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3ని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8 GB RAM, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ప్రాసెసర్‌గా, ఈ ఫోన్‌లో Snapdragon 6s Gen 3ని పొందుతారు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. OS విషయానికి వస్తే.. ఈ ఫోన్ Android 14 ఆధారంగా MyUXలో పనిచేస్తుంది.

Show comments