మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో శాంసంగ్, ఆపిల్ వంటి ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు, ఆఫర్‌లు ఇస్తున్నారు. ఫెస్టివ్ సీజన్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ S23 FE (Galaxy S23 FE) కూడా ఉంది. మీరు శాంసంగ్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం.