టెక్నాలజీ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. హాయ్ మోటో అంటూ మోటరోలా వినూత్నమయిన మొబైల్స్ విడుదల చేస్తోంది. తాజాగా స్లిమ్ ఫోన్ ను విడుదలచేసింది మోటరోలా. Motorola Edge 30.. Edge 30 సిరీస్‌లో వచ్చిన రెండవ ఫోన్ అంటున్నారు. మొట్టమొదటిది మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఇది భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌ను ఉపయోగించిన అత్యంత చౌకైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ గా పేరు తెచ్చుకుంది. Motorola Edge 30 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ అని Motorola చెబుతోంది. ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉందంటున్నారు. Motorola ఎడ్జ్ 30 తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు మంచి అనుభూతినిస్తుంది.
Motorola Edge 30 స్పెసిఫికేషన్స్
* 50-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్
* ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్లు
* అల్ట్రా వైడ్ సెన్సార్ స్పెషాలిటీ
* మాక్రో పిక్చర్ క్వాలిటీ పరంగా ప్రత్యేకత
* క్వాల్ కమ్ (qualcomm Snapdragon) 778+5G ప్రాసెసర్
* 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో 144hz రిఫ్రెష్ రేట్
*HDR10+, DC-Dimming డిస్ ప్లే
* ఫింగర్ ప్రింట్ రీడర్ డిస్ ప్లే
* ఫోన్ 6GB+128GB స్టోరేజ్
* 8GB+256GB స్టోరేజ్ వేరియంట్
* రెండు RAM వేరియంట్‌లలో లభ్యం
*Edge 30 ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్
* ఆండ్రాయిడ్ 13 మరియు 14కి అప్‌గ్రేడ్
* 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
* 4020mAh బ్యాటరీ సామర్ధ్యం
* స్టీరియో స్పీకర్‌లు, డాల్బీ అట్మోస్ క్వాలిటీ
* Noise Less ఆడియో అనుభవం
* 6GB+128GB వేరియంట్ ధర రూ.27,999
* 8GB+256GB వేరియంట్ ధర రూ.29,999
Motorola Edge 30పై తగ్గింపు ధరలు
Motorola Edge 30 కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి ఆఫర్లు అందుబాటులో వున్నాయి. ఇండియాలో 6GB+128GB వేరియంట్ రూ.27,999 ప్రారంభ ధరలో లభిస్తోంది. అలాగే, 8GB+256GB వేరియంట్ రూ.29,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లపై రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. దీని కారణంగా ధర 6GB వేరియంట్‌కు రూ. 25,999 మరియు 8GB వేరియంట్‌కు రూ. 27,999కి తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లభిస్తోంది. మే 19, మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ ఈకామర్స్ వెబ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు.
Fuel Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు