Moto G42: ఇండియాలో మోటో జీ 42 లాంచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీంతో పాటు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రెడిమి నోట్ 11, రియల్ మీ 9ఐ, పోకో ఎం4 ప్రో వంటి వాటితో మోటో జీ42 పోటీ పడనుంది
ధర విషయానికి వస్తే 4జీ రామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999గా ఉంది. అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోస్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. జూలై 11 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో ఫోన్ లభించనుంది. మోటో జీ42 లాంచ్ ఆఫర్ కింద ఎస్బీఐ కార్డు వినియోగించే వారికి రూ. 1000 డిస్కౌంట్ ఇస్తోంది.
Also Read
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
- Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
మోటో జీ42 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ద్వారా పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్(1,080×2,400 పిక్సెల్‌లు) అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్రిపుర్ రియర్ కెమెరాతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది. ఎఫ్/1.8 లెన్స్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, డెప్త్ షూటర్ తో పాటు 2- మెగా పిక్సెల్ షూటర్ ను కలిగి ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1 టీబీ మెమోరీ స్టోరేజిని సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్, ఎఫ్ఎం, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్, డ్యుమల్ స్పీకర్ డాల్బీ అట్మోస్ ను సపోర్టింగ్ ఫీచర్లు మోటో జీ 42లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!