Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Diwali Celebrations: భారత్‌లోనే కాదు.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ (Pakistan) దీపావళి (Diwali) పండుగ వేడుకలు అంబరాన్ని తాకాయి. అక్కడ ఉన్న హిందూ కమ్యూనిటీ (Hindu community) ఎంతో ఉత్సాహంగా, జోష్‌గా దివ్య కాంతుల పండుగను జరుపుకుంటోంది. ఈ శుభసందర్భంగా పాకిస్థాన్ ప్రెసిడెంట్ (President) ఆసిఫ్ అలీ జర్దారీ, పాక్ ప్రధాని (Prime Minister) షెహబాజ్ షరీఫ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, అలాగే తమ దేశంలో నివసిస్తున్న హిందూ సోదరులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వెలుగుల పండుగ సందర్భంగా పాకిస్థాన్‌లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. హిందువులు ప్రార్థనలు చేసి, దివ్యమైన ప్రమిదలు వెలిగించి ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున ప్రెసిడెంట్ జర్దారీ, పీఎం షెహబాజ్ షరీఫ్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. సమాజంలో సోదరభావం పెరగాలని, దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర చాలా కీలకమని కొనియాడారు. ద్వేషం, అసహనం, నిరాశ అనే చీకట్లపై కాంతి సాధించే విజయానికి ఈ దీపావళి పండుగ నిదర్శనమని తమ సందేశంలో పేర్కొన్నారు. మనుషుల మధ్య సంబంధాలను పెంపొందించడానికి, సమాజంలో అందరూ శాంతియుతంగా కలిసిమెలిసి జీవించడానికి ఈ పండుగ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.
Also Read
- Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
- Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
- PM Modi: "ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి".. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
ముఖ్యంగా పాకిస్థాన్‌లోని మైనార్టీ హక్కులను కాపాడటం తమ అందరి ఉమ్మడి బాధ్యత అని ప్రెసిడెంట్ జర్దారీ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న హిందూ కమ్యూనిటీ పాకిస్థాన్ జాతీయ జీవితంలో ఒక విడదీయరాని భాగమని కొనియాడారు. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, బిజినెస్, పబ్లిక్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ఆర్ట్-కల్చర్ లాంటి ఎన్నో రంగాల్లో హిందువులు అందిస్తున్న సేవలు దేశాన్ని ఎంతో సమృద్ధిగా మార్చాయని ప్రశంసించారు. మరోవైపు.. తమ దేశ సామాజిక నిర్మాణంలో హిందువులు అత్యంత కీలకమైన భాగమని పీఎం షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. మతం, నమ్మకం, రంగు లేదా కులంతో సంబంధం లేకుండా పాకిస్థాన్ పౌరులందరి హక్కులు, ఆత్మగౌరవం, మత స్వేచ్ఛను (religious freedom) కాపాడటానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
-
Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
-
Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
-
PM Modi: “ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి”.. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!