IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
- 13,629 అడుగుల ఎత్తులో విమానం ల్యాండింగ్
- లడఖ్‌లో IAF సరికొత్త ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAF Creates History: భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఘనత సాధించింది. భారీ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు, ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగల IL-76MD హెవీ లిఫ్ట్ రవాణా విమానం లడఖ్‌లోని నియోమా ఎయిర్‌ఫీల్డ్‌లో విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర మట్టానికి 13,629 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో విమానం దిగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ తరహా విమానం ప్రపంచంలోనే ఇంత ఎత్తులో ల్యాండ్ కావడం ఇదే తొలిసారి అని భారత వాయుసేన వెల్లడించింది. శనివారం జరిగిన ఈ చారిత్రాత్మక ల్యాండింగ్‌తో భారత వాయుసేన తన వ్యూహాత్మక రవాణా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తక్కువ గాలి సాంద్రత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య విమానాన్ని సురక్షితంగా దించిన పైలట్లు, సిబ్బంది నైపుణ్యాన్ని వాయుసేన ప్రశంసించింది.
13,629 అడుగుల ఎత్తులో చారిత్రాత్మక ల్యాండింగ్
ఈ విజయాన్ని భారత వాయుసేన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించింది. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD విమానం విజయవంతంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ‘13,629 అడుగులు.. విమానయాన చరిత్రలో సరికొత్త శిఖరం’ అంటూ ఈ ఘనతను అభివర్ణించింది. పరిమితులను అధిగమిస్తూ, కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొంది. ఈ ల్యాండింగ్ భారతదేశ వ్యూహాత్మక వైమానిక రవాణా సామర్థ్యానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని వెల్లడించింది.
Also Read
- PM Modi: "ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి".. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
- Sonia Gandhi: బాబ్రీ మసీదు కూలుస్తుంటే టీవీలో చూస్తూ ఏడ్చేశాను.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
- LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
- Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
IL-76MD గజరాజ్ విమానం ప్రత్యేకతలేంటి?
భారత వాయుసేనలో IL-76MD విమానాన్ని ‘గజరాజ్’ అని పిలుస్తారు. రష్యా మూలాలున్న ఈ భారీ సైనిక రవాణా విమానంలో నాలుగు ఇంజిన్లు ఉంటాయి. సైనికులు, భారీ యుద్ధ సామగ్రి, వాహనాలు, ఇతర సరుకులను సుదూర ప్రాంతాలకు తరలించడానికి దీనిని ఉపయోగిస్తారు. 1985 జూన్ 16న ఈ విమానాన్ని భారత వాయుసేనలో అధికారికంగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దేశ రక్షణ, సైనిక రవాణా వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ విమానం ద్వారా T-72 యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక వాహనాలు, ఇతర రక్షణ పరికరాలను తరలించవచ్చు. సైనిక కార్యకలాపాలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, అత్యవసర రవాణా అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కఠినమైన పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించే భారత సైనికులకు అవసరమైన సామగ్రిని వేగంగా చేరవేయడంలో గజరాజ్ కీలకంగా ఉంటుంది.
నియోమా ఎయిర్‌ఫీల్డ్ ఎందుకంత కీలకం?
లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న నియోమా ఎయిర్‌ఫీల్డ్ భారత రక్షణ వ్యవస్థకు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనది. ఇది వాస్తవాధీన రేఖ (LAC) నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సముద్ర మట్టానికి సుమారు 13,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో విమానాల రాకపోకలు నిర్వహించడం అంత సులభం కాదు. అధిక ఎత్తు కారణంగా గాలి సాంద్రత తక్కువగా ఉండటం, కఠినమైన పర్వత భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పులు విమానాల నిర్వహణకు సవాళ్లుగా ఉంటాయి. ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో సుమారు 2.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దీని ద్వారా తూర్పు లడఖ్‌లో సైనిక రవాణా, అత్యవసర కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల్లో సైనికులకు అవసరమైన సహాయాన్ని అందించే సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.
చైనా సరిహద్దు వద్ద భారత్‌కు వ్యూహాత్మక బలం
చైనా సరిహద్దుకు సమీపంలోని తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో నియోమా ఎయిర్‌ఫీల్డ్ కీలక పాత్ర పోషించనుంది. భారీ రవాణా విమానాలు ఇక్కడ ల్యాండ్ కావడం వల్ల సైనికులు, యుద్ధ సామగ్రి, భారీ వాహనాలను వేగంగా తరలించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సైన్యానికి అవసరమైన లాజిస్టికల్ సహకారం అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
13,629 FEET. A NEW HEIGHT IN AVIATION HISTORY.
An Indian Air Force IL-76MD has scripted history with a successful landing at Nyoma, marking the highest-altitude landing ever achieved by the aircraft anywhere in the world.
A remarkable demonstration of the aircraft’s enduring capability, backed by the exceptional skill, precision, and professionalism of its crew.A milestone that reinforces India’s strategic airlift capability.
Pushing boundaries. Redefining limits. Making history.
#IndianAirForce #IAF #Nyoma #AviationHistory #IndianDefence
@DefenceMinIndia
@SpokespersonMoD
@HQ_IDS_India
@adgpi
@indiannavy
@CareerinIAF
@air_veterans— Indian Air Force (@IAF_MCC) November 7, 2026
తాజావార్తలు
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
-
Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
-
Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
-
PM Modi: “ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి”.. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
-
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!