Lenovo Tab: డాల్బీ ఆటమ్స్ సౌండ్, 5,100mAh బ్యాటరీ, 4 సంవత్సరాల సెక్యూరిటీతో కొత్త ట్యాబ్ లాంచ్!
- ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ Lenovo Tab భారతదేశంలో విడుదల
- 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే
- 5,100mAh బ్యాటరీ, 15W చార్జింగ్ సపోర్ట్
- 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
- 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Wi-Fi వెర్షన్ ధర రూ.10,999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Tab: లెనోవో తన తాజా ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ Lenovo Tabను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్, 4GB RAM తో పాటు 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే (60Hz రిఫ్రెష్ రేట్) ఉంది. 5,100mAh బ్యాటరీతో వచ్చిన ఈ డివైస్ 15W చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు Wi-Fi మాత్రమే లేదా Wi-Fi + LTE వెర్షన్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 8MP రియర్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు (Dolby Atmos) ఉన్నాయి.
ఈ కొత్త లెనోవో ట్యాబ్ ధర భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Wi-Fi వెర్షన్ ధర రూ.10,999గా నిర్ణయించబడింది. అదే కాన్ఫిగరేషన్‌కి Wi-Fi + LTE కనెక్టివిటీతో కూడిన వెర్షన్ ధర రూ. 12,999గా ఉంది. ఇక 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi మోడల్ ధర రూ. 11,998గా ఉంది. ఈ ట్యాబ్స్ పోలార్ బ్లూ (Polar Blue) కలర్‌లో అందుబాటులో ఉంటుంది. లెనోవో వెబ్ సైట్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఇంకా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇదే ఈవెంట్‌లో లెనోవో ఐడియా ట్యాబ్ (Idea Tab) కూడా ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ.16,999.
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
Engagement With AI Chatbot: సంచలనం.. AIతో ప్రేమ, ఐదు నెలల్లో నిశ్చితార్థం! మహిళ పోస్ట్ వైరల్..

లెనోవో ట్యాబ్ స్పెసిఫికేషన్లు:
సాఫ్ట్వేర్: Android 14 ఆధారంగా Lenovo ZUI 16.
అప్‌డేట్స్: 2 సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచులు.
డిస్ప్లే: 10.1 అంగుళాల Full-HD (1,200×1,920) పిక్సెల్స్, 60Hz రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్‌నెస్, TÜV Low Blue Light సర్టిఫికేషన్.
ప్రాసెసర్: MediaTek Helio G85 ఆక్టా-కోర్.
ర్యామ్, స్టోరేజ్: 4GB LPDDR4X RAM, గరిష్టంగా 128GB eMMC స్టోరేజ్.
Poco M7 Plus 5G: 7,000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. మిడ్ రేంజ్ ఫోన్స్ బాప్ ఆగయా!

కెమెరాలు: 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
ఆడియో: డ్యూయల్ స్పీకర్లు డాల్బీ ఆటమ్స్ ట్యూనింగ్‌తో.
బాడీ: మెటల్ బాడీ డిజైన్.
కనెక్టివిటీ: బ్లూటూత్ 5.3, Wi-Fi 5, పేస్ అన్ లాక్ సపోర్ట్.
యాక్సెసరీస్: ఇన్‌బిల్ట్ కిక్‌స్టాండ్ ఉన్న క్లియర్ కేస్, స్టాండ్ బై మోడ్ (ఫోటో ఫ్రేమ్ లేదా క్లాక్‌గా ఉపయోగించుకోవచ్చు).
బ్యాటరీ: 5,100mAh, 15W ఫాస్ట్ చార్జింగ్.
సైజు: 9.5 × 235.7 × 154.5 మిమీ.

తాజావార్తలు
-
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
-
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!