James Webb Telescope: విశ్వంలోనే లోతైన ఫోటో.. జూలై 12 రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వాంతరాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. మనం ఎవరం, ఈ విశ్వమేంటి.. అసలు మనం ఎక్కడ ఉన్నాం.. భూమి లాంటి గ్రహాలు మరెక్కడైనా ఉన్నాయా..? అనే సందేహాలు నిత్యం తొలుస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మన పాలపుంత గెలాక్సీకి చెందిన వివరాలనే మనిషి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అలాంటి కొన్ని బిలియన్ల గెలాక్సీలు అందులో కోటానుకోట్ల నక్షత్రాలు, మన ఊహకు కూడా అందని అంత విశ్వ రహస్యాలను కనుకునేందుకు మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగానే గతేడాది డిసెంబర్ లో జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా ప్రయోగించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో నిర్మితమైన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ దాదాపుగా రూ. 78,900 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇన్నాళ్లు విశ్వాంతరాలను జల్లెడ పడుతున్న హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే కొన్ని వేల రేట్లు ఆధునాతనమైంది ఈ జెమ్స్ వెబ్ టెలిస్కోప్. హబుల్ తీసిన ‘ ది హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్’ విశ్వంలో కేవలం ఒక ప్రాంతంలోనే కొన్ని వేల గెలాక్సీల ఫోటోను తీసింది. అలాంటి జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం ఏర్పడటం, బిగ్ బ్యాంగ్, విశ్వం పుట్టిన తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలు, నక్షత్రాలకు సంబంధించి ఫోటోలు తీయనుంది. ప్రస్తుతం భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో లాగ్రేంజ్ పాయింట్ 2(ఎల్ 2) కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.
Also Read
- Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
దాదాపు ప్రయోగించిన ఆరు నెలల తరువాత జెమ్స్ వెబ్ లోని అన్ని వ్యవస్థలు చల్లబడిన తర్వాత తన పనిని మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ బుధవారం జెమ్స్ వెబ్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. జూలై 12న ‘‘మన విశ్వంలోని లోతైన చిత్రాన్ని’’ జెమ్స్ వెబ్ రిలీజ్ చేస్తుందని వెల్లడించారు. గతంలో హబుల్ తీసిన డీప్ ఫీల్డ్ ఇమేజ్ కన్నా లోతైన ఫోటోలను ఈ టెలిస్కోప్ తీయనుంది.
జెమ్స్ వెబ్ ను ఇంజనీరింగ్ అద్భుతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ కు సంబంధించిన చిత్రాలను కూడా చూసేందుకు అంటే దాదాపు కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాలకు పూర్వ జరిగిన విశ్వాన్ని చూసేందుకు వెబ్ లోని ఇన్ఫ్రారెడ్ పరికరాలు సహాయపడనున్నాయి. దీంతో పాటు ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఎక్సో ప్లానెట్స్.. వాటిలో భూమి లాంటి పోలికలు, వాతావరణం ఉన్న గ్రహాలను కూడా జెమ్స్ వెబ్ గుర్తించే వీలుంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!