రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే వారం భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు విక్రయానికి సిద్ధమవుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.. ముందుగా iQOO Z11 Lite 5G ఫోన్ జులై 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. మిడ్నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ రంగుల్లో లభించే ఈ ఫోన్ అసలు ధరల ప్రకారం 4GB+128GB వేరియంట్ రూ.19,499, 6GB+128GB వేరియంట్ రూ.21,499 … 6GB+256GB వేరియంట్ రూ.24,499గా ఉన్నాయి. అయితే SBI, Axis బ్యాంక్ కార్డుల ద్వారా రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది, దీనివల్ల వీటి ప్రారంభ ధర రూ.17,999కి తగ్గుతుంది.
డిజైన్, డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.74 అంగుళాల HD+ IPS డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై నడిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల OS, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. కెమెరా విభాగంలో వెనుక వైపు సోనీ సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో AI క్రియేషన్, గూగుల్ జెమిని వంటి అధునాతన AI ఫీచర్లు ఉన్నాయి. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,500mAh భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల కాలింగ్ టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
మరోవైపు Lava Virat V1 5G , Virat V1 4G ఫోన్లు జులై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, లావా వెబ్సైట్లలో అందుబాటులోకి వస్తాయి. 5G మోడల్ ధర రూ.12,999 కాగా తొలిరోజు ఆఫర్లో రూ.11,999కే లభిస్తుంది. 4G మోడల్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్లో రూ.8,999కి అందుబాటులో ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. రెండింటిలోనూ 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, IP64 రేటింగ్, 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 5G వెర్షన్ ఆండ్రాయిడ్ 16, Unisoc T8200 ప్రాసెసర్ , 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 4G వెర్షన్ ఆండ్రాయిడ్ 15, Unisoc SC9863A ప్రాసెసర్ 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. రెండింటిలోనూ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా లావా సంస్థ తన వినియోగదారులకు డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అందిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!