iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Launch Date: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, యాపిల్ తన తదుపరి ఐఫోన్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘ఐఫోన్ అల్ట్రా’ను కూడా పరిచయం చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ 9 లేదా 10న లాంచ్?
యాపిల్ గత కొన్నేళ్లుగా సెప్టెంబర్‌లోనే కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ ఈవెంట్ నిర్వహించే అవకాశముందని మార్క్ గుర్మన్ తెలిపారు. అమెరికాలో లేబర్ డే, సెప్టెంబర్ 11 వార్షిక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో ఈవెంట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- 165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
- HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
ఐఫోన్ 18 ప్రోలో భారీ అప్గ్రేడ్లు
లీకుల ప్రకారం ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో 2nm టెక్నాలజీతో రూపొందించిన కొత్త A20 Pro చిప్సెట్ ఉండనుంది. దీంతో పనితీరు మరింత వేగవంతంగా ఉండటంతో పాటు బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది. యాపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన C2 మోడెమ్, చిన్న పరిమాణంలో డైనమిక్ ఐలాండ్, అండర్-డిస్ప్లే ఫేస్ ఐడీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్ అపర్చర్ కెమెరా టెక్నాలజీని అందించే అవకాశం ఉందని సమాచారం. దీంతో వినియోగదారులు కాంతి పరిమాణాన్ని అవసరానికి అనుగుణంగా నియంత్రించగలుగుతారు.
ఫోల్డబుల్ ‘ఐఫోన్ అల్ట్రా’పై భారీ అంచనాలు
ఈసారి యాపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ‘ఐఫోన్ అల్ట్రా’గా పిలుస్తున్న ఈ ఫోన్ ఇతర ఫోల్డబుల్ ఫోన్ల కంటే వెడల్పైన డిస్ప్లే, మెరుగైన హింజ్ డిజైన్‌తో రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఫోన్ తెరిచినప్పుడు కేవలం 4.5 మిల్లీమీటర్ల మందంతో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫోన్లో కూడా A20 Pro చిప్, C2 మోడెమ్, 12GB ర్యామ్, ప్రత్యేక కెమెరా కంట్రోల్ బటన్ వంటి ఫీచర్లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ధరలు పెరిగే అవకాశం
ఇటీవల భారత్‌లో మ్యాక్బుక్లు, మ్యాక్ మినీ, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ వంటి ఉత్పత్తుల ధరలను యాపిల్ పెంచింది. గ్లోబల్ మార్కెట్లో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదే ప్రభావం ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పైనా పడే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రో మోడళ్ల ధరలు 200 డాలర్ల వరకు పెరగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై యాపిల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Bisleri in Trouble Again: మళ్లీ చిక్కుల్లో బిస్లెరీ.. నీటి నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా.. FSSAI కీలక చర్య
-
Moksagna: మోక్షజ్ఞ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
-
Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
-
Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!