Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Auto Scroll: సోషల్ మీడియా ప్రపంచంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ఒక సాధారణ వినోదం నుంచి ఓ వ్యసనంగా మారి పోయింది. పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో మెటా సంస్థ ఇప్పుడు మరింత వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దాని పేరు ‘Auto Scroll’. ఇది పూర్తి స్థాయిలో రీల్స్ అనుభూతిని మార్చేసే దిశగా రూపొందుతుంది. మరి ఈ ఫీచర్ ఏంటి..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..? అనే వివరాలను చూద్దామా..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!

‘Auto Scroll’ అనే ఈ కొత్త ఫీచర్, రీల్స్‌ను తనంతట అవే (Hands Free) స్క్రోల్ చేసేలా రూపొందించబడుతోంది. యూజర్ ఎటువంటి స్వైప్ చేయకుండానే, ఒక రీల్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ రీల్‌కు స్క్రోల్ అవుతుంది. ఇది ఒక చిన్న మార్పులా కనిపించినా, రీల్స్ ను చేసే వీలును మరింత పెంచేందుకు ఇదొక కీలక అడుగుగా మారనుంది. ఒకవేళ Auto Scroll ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు మాన్యువల్‌గా స్వైప్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. దీనివల్ల క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశముంది. కొద్ది సమయంలోనే ఎక్కువ కంటెంట్ యూజర్ చూస్తే, అల్గారిథమ్ లలో మంచి రీచ్ ఏర్పడే వీలుంది.

ఇంతకీ ఇది ఎంత వరకూ ఉపయోగకరమో అనేది ఒక వైపు, మరోవైపు డిజిటల్ వ్యసనం గురించి ఆందోళనలు మొదలయ్యాయి. యూజర్లు తమ చేతుల్లో నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మనం స్క్రోల్ చేయకుండానే కంటెంట్ ముందుకు పోతే, ఏ కంటెంట్‌కు ఆగాలి, ఏదాన్ని దాటేయాలి అనే ఆలోచనే తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ Auto Scroll ఫీచర్‌ను మెటా కొంతమంది యూజర్లతో టెస్టింగ్ దశలో ఉంచింది. అయితే, ఇది ఇప్పుడు అందిరికి అందుబాటులో లేదు. ఈ టెస్టింగ్ విజయవంతం అయితే, త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వస్తుందని సమాచారం.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!