Hydrogen Water Bottle: సాధారణంగా వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది.. రూ.50 లేదా రూ.100 అనుకుందాం. కాపర్ లేదా గాజుతో తయారు చేసిన వాటర్ బాటిల్ ధర మహా అంటే రూ.500 వరకు ఉంటుంది. కానీ ఒక వాటర్ బాటిల్ ధర అక్షరాల రూ.9,999 ఉందని మీకు తెలుసా. ఇంతీకీ ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటి, ఈ బాటిల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Best Camera Phones: రూ.30,000 లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..
కొత్త వాటర్ బాటిల్ ధర..
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ హైడ్రోజన్ వాటర్ బాటిల్ జెన్ 4 అనే కొత్త వాటర్ బాటిల్ వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ వాటర్ బాటిల్ ధర రూ.9,999. కంపెనీ వివరాల ప్రకారం.. ఇది నీటిలో హైడ్రోజన్ కంటెంట్‌ను పెంచే తెలివైన వ్యవస్థను కలిగి ఉంటుందని సమాచారం. ఈ నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో, స్థానిక మార్కెట్లో హైడ్రోజన్ వాటర్ బాటిళ్లకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి వేర్వేరు ఛార్జింగ్ బ్యాటరీ సామర్థ్యాలు, ధరల శ్రేణులలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బాటిళ్ల ధర రూ.13 వేల వరకు ఉన్నాయి. మరికొన్ని 1 లీటర్ వరకు సామర్థ్యం కలిగి ఉంటాయి.
ఈ బాటిల్ ఎలా పనిచేస్తుందంటే..
హైడ్రోజన్ వాటర్ బాటిల్ అనేది తప్పనిసరిగా నీటి బాటిల్‌ను పోలి ఉండే పోర్టబుల్ పరికరం. ఈ వ్యవస్థ తాగునీటిలో పరమాణు హైడ్రోజన్ వాయువును నింపడం ద్వారా పనిచేస్తుంది. ఈ బాటిల్లో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార్చడానికి విద్యుద్విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తారు. తరువాత ఇది అదనపు మొత్తంలో హైడ్రోజన్‌ను నీటిలో కరిగించి నీటిని శుద్ధి చేస్తుంది. వాటర్ బాటిల్లో ప్రక్రియ జరుగుతున్నట్లు సూచించడానికి బాటిల్ లోపల LED లైట్లను ఉపయోగిస్తారు. ప్రక్రియ జరుగుతున్నట్లు గుర్తించడానికి రంగులను గమనిస్తే సరిపోతుంది. కావాలనుకుంటే ఆన్ లేదంటే ఆఫ్ చేయగల స్విచ్ కూడా ఈ బాటిల్లో ఉంది. దీనికి ఛార్జ్ చేయడానికి దాదాపు 60 నిమిషాలు పడుతుందని సమాచారం. ఇంతకీ ఈ వాటర్ బాటిల్ సాధారణ సీసా అయితే కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Delhi Acid Attack 2025: ఢిల్లీలో యాసిడ్ దాడి.. గాయపడిన విద్యార్థిని