Huawei Qingyun C7: Huawei కొత్త టాబ్లెట్ లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Qingyun C7: ప్రముఖ టెక్నాలజీ సంస్థ Huawei మరో కొత్త టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Huawei Qingyun C7 పేరుతో ఈ కొత్త బిజినెస్ టాబ్లెట్‌ను చైనాలో అధికారికంగా పరిచయం చేసింది. ఆకర్షణీయమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లతో దీనిని రూపొందించింది. ముఖ్యంగా ఇందులో 10,100mAh భారీ బ్యాటరీ, 50MP రియర్ కెమెరా, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కొత్త టాబ్లెట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
Huawei Qingyun C7 టాబ్లెట్‌ను కంపెనీ ప్రస్తుతం చైనా మార్కెట్లో పరిచయం చేసింది. అయితే దీని ధరను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ టాబ్లెట్‌ను లిస్ట్ చేసింది. ఇది సింగిల్ స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో విడుదల అవుతుందా? అనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read
- 165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
- HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
ఈ టాబ్లెట్‌లో 12 ఇంచుల IPS డిస్ప్లేను అందించారు. ఇది 2800 × 1840 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 2.8K విజువల్స్‌ను అందిస్తుంది. ఇందులోని ముఖ్యమైన డిస్ప్లే ఫీచర్లు:
12 ఇంచుల IPS డిస్ప్లే
2.8K రిజల్యూషన్ (2800 × 1840 పిక్సెల్స్)
144Hz రిఫ్రెష్ రేట్
900 నిట్స్ పీక్ బ్రైట్నెస్
88 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో
P3 కలర్ గామట్ సపోర్ట్
1500:1 కాంట్రాస్ట్ రేషియో
అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, ఇతర విజువల్ అనుభవాలు మరింత స్మూత్‌గా ఉండనున్నాయి. Huawei Qingyun C7లో అతిపెద్ద ప్రత్యేకత దాని బ్యాటరీ. ఇందులో 10,100mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందించారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఎక్కువ సమయం టాబ్లెట్‌పై పనిచేసేవారికి, ఆన్లైన్ మీటింగ్స్, వీడియోలు, ఇతర బిజినెస్ అవసరాలకు ఈ బ్యాటరీ ఉపయోగకరంగా ఉండనుంది. అయితే బ్యాటరీ బ్యాకప్, పూర్తి ఛార్జింగ్ సమయంపై కంపెనీ వివరాలు వెల్లడించలేదు.
50MP రియర్ కెమెరా.. 8MP ఫ్రంట్ కెమెరా
కెమెరా విభాగంలోనూ Huawei మంచి స్పెసిఫికేషన్లను అందించింది.
రియర్ కెమెరా:
50MP కెమెరా
ఆటోఫోకస్ సపోర్ట్
LED ఫ్లాష్
ఫ్రంట్ కెమెరా:
8MP కెమెరా
f/2.2 అపెర్చర్
ఈ టాబ్లెట్ కెమెరా ద్వారా 1080p రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
పనితీరు కోసం ఇందులో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఈ టాబ్లెట్ HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అలాగే పలు AI ఆధారిత ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రాసెసర్‌కు సంబంధించిన చిప్సెట్ వివరాలను మాత్రం Huawei ఇంకా వెల్లడించలేదు. టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు 3D కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించినట్లు కంపెనీ తెలిపింది.
కనెక్టివిటీ విషయంలో Huawei Qingyun C7లో ఆధునిక ఫీచర్లను అందించారు.
Wi-Fi 7+ సపోర్ట్
Bluetooth 6.0
NearLink కనెక్టివిటీ
దీంతో వైర్లెస్ కనెక్టివిటీ, ఇతర అనుకూల పరికరాలతో అనుసంధానం మరింత సులభం కానుంది. డిజైన్ పరంగా ఈ టాబ్లెట్ మెటల్ యూనిబాడీ నిర్మాణంతో వస్తుంది. దీని మందం కేవలం 5.9 మిల్లీమీటర్లు మాత్రమే. బరువు 555 గ్రాములుగా ఉంది. సన్నని డిజైన్‌తో పాటు పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉండటం ఈ టాబ్లెట్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Huawei Qingyun C7: Huawei కొత్త టాబ్లెట్ లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
AP Panchayat Elections 2026: ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 1170 సర్పంచ్, 19655 వార్డులు ఏకగ్రీవం!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Jharkhand: ఆలయ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
-
Iran Starlink Report: అమెరికా సైనికులపై దాడులకు ఇరాన్ Starlink వినియోగం?.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!