మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను నిర్వహిస్తోంది. నవంబర్ 23న మొదలైన ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో శామ్‌సంగ్, ఎంఐ, ఒప్పో, రియల్‌మీ, మోటో, గూగుల్ పిక్సెల్ సహా ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. 53 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ 7 వేలకే మీ సొంతం అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ గతేడాది రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.52,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఆఫర్స్ ఉన్నాయి. రూ.34,999 ధరకు లిస్ట్ చేయబడింది. అంటే మీరు 33 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్ అనంతరం ధర రూ.29,999కి తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. గూగుల్ పిక్సెల్ 8ఏపై ఏకంగా రూ.27,950 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ ఫోన్ దాదాపుగా 2 వేలకు మీ సొంతమవుతుంది. అయితే మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉండి.. ఎలాంటి డామేజ్ లేకుండా ఉండాలి.
Also Read: WPL 2026 Auction: నేడు 2026 డబ్ల్యూపీఎల్ వేలం.. ఆ ఇద్దరు భారత స్టార్స్‌కు డబ్బే డబ్బు!
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్స్:
# 6.1 అంగుళాల డిస్‌ప్లే
# 120Hz రీఫ్రెష్ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్
# కార్నింగ్ గొరిల్లా గ్లాస్
# ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
# 64MP ప్రధాన లెన్స్‌తో పాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్
# ముందు భాగంలో 13MP కెమెరా
# ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,404mAh బ్యాటరీ