Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ పేరు వినగానే మీ మదిలో ఏ ఫొటో వస్తుంది..? మొబైల్ ఫోన్, ఫ్రిజ్, టీవీ, గృహోపకరణాల కనిపిస్తాయి. కానీ.. ఈ కంపెనీ మొదట్లో ఏం చేసేది? అనే విషయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. శాంసంగ్ మార్చి 1, 1938న ప్రారంభమైంది. దాని వ్యవస్థాపకుడు లీ బైయుంగ్-చుల్. దక్షిణ కొరియాలోని డేగు నగరంలో ప్రారంభమైన కంపెనీ.. మొదట్లో ఎండిన చేపలు, పండ్లు, నూడుల్స్ విక్రయించే దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం రవాణా, రియల్ ఎస్టేట్, బీమా, బ్రూయింగ్ వంటి రంగాలలో విస్తరించింది.
READ MORE: Chicken: ఎక్స్‌ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్‌నే చంపేశాడు..
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
1938లో దక్షిణ కొరియాలో లీ బైంగ్-చుల్ స్థాపించిన ఈ సంస్థ, మొదట్లో తన వ్యాపారాన్ని ఎండు చేపలు, కిరాణా సామాగ్రి, నూడుల్స్ అమ్మకాలతో ప్రారంభించింది. అయితే, కాలక్రమేణా శామ్సంగ్ తన వ్యాపార మార్గాన్ని మార్చుకుంది. 1969 నుంచి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలోకి ప్రవేశించి, రేడియోలు, టెలివిజన్లు, గృహోపకరణాలు, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఎండు చేపల వ్యాపారం చేసినప్పటికీ.. కాలక్రమేణా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీగా ఎదిగింది. 1987లో మరణించే వరకు లీ బైంగ్-చుల్ కంపెనీకి నాయకత్వం వహించారు. ఇప్పుడు మనవరాళ్ళు ప్రొఫెషనల్ మేనేజర్‌లతో కలిసి శామ్‌సంగ్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు.
READ MORE: Pilot Project: ఏపీలో మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం.. 10 నిమిషాల్లో పని పూర్తి!
ఇదిలా ఉండగా.. తాజాగా శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో ‘గెలాక్సీ Z ఫోల్డ్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ఉన్నాయి. కంపెనీ తన ‘గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్’లో వీటిని ఆవిష్కరించింది. గతేడాది విడుదల చేసిన ‘గెలాక్సీ Z ఫోల్డ్ 6’, ‘Z ఫ్లిప్ 6’కు కొనసాగింపుగా వీటిని ప్రారంభించింది. అయితే ఈసారి వీటిని మరింత స్లిమ్ డిజైన్‌లో తీసుకొచ్చింది. భారత మార్కెట్లో వీటి ధరలను ప్రకటించడంతో పాటు ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ‘గెలాక్సీ Z ఫోల్డ్7’ రూ.1,74,999 నుంచి ప్రారంభమవుతుంది. ‘గెలాక్సీ Z ఫ్లిప్7’ రూ.1,09,999 నుంచి ప్రారంభమవుతుంది. మరింత సరసమైన ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ధర రూ.89,999 నుంచి లభిస్తుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!