ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ సంవత్సరం తన మొదటి సేల్‌ను ‘బిగ్ సేవింగ్స్’ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈ రాత్రి (జనవరి 6) ముగుస్తుంది. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ అనేక ఆఫర్‌లు, డీల్‌లను అందిస్తోంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, టీడబ్ల్యూఎస్, ఇయర్‌బడ్‌లు, గృహోపకరణ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఉంది. వాషింగ్ మెషీన్‌లను కూడా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లను కూడా మీరు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఉపకరణాలపై బంపర్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్ సమయంలో యాపిల్ ఐఫోన్ 16ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 2024లో రూ.79,990కు లాంచ్ అయిన ఐఫోన్ 16.. అన్ని ఆఫర్ల అనంతరం రూ.56,000కు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 16 లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉంటుంది. ఇది యాపిల్ A18 (3 nm) చిప్‌సెట్, యాపిల్ జీపీయూ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 48MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Also Read: Sakshi Vaidya: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆఫర్ వచ్చినా.. నేనే తప్పుకున్నా!
దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి రిలీజ్ అయిన గెలాక్సీ ఎస్24 కూడా తగ్గింపు ధరకు లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.40,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 6.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO డిస్‌ప్లే, ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వెనుక భాగంలో 50MP ఓఐఎస్+ 12MP అల్ట్రావైడ్+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్ జూమ్ లెన్స్ కెమెరా.. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4,000mAh బ్యాటరీతో వచ్చింది.